ఈ మాజీల భవిష్యత్తేంటి..?

mahabub nagar

 గతంలో ఒక వెలుగు వెలిగిన నేతలు, రాజకీయ దురంధురులుగా పేరు తెచ్చుకున్న అనేక మంది నేతలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ లోని ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన ఐదురుగు మాజీ మంత్రులు పొలిటికల్ కెరీర్ చరమకంలోకి వచ్చినట్లు అర్ధం అవుతుంది. పార్టీ లతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ తో రాజకీయాలు చేసిన నేతలు వాళ్ళు. అందులో ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డి ఒకరు అలాగే పి. చంద్ర శేఖర్ మరొకరు ఇద్దరు కూడా టీడీపీ హయాంలో మంత్రులుగా ఒక వెలుగు వెలిగారు.

mahabub nagar

  2019 ఎన్నికల్లో నాగం జనార్దన్ కాంగ్రెస్ తరుపున పోటీచేసి ఓడిపోయాడు. దీనితో పార్టీకి కొంచం దూరంగా హైదరాబాద్ లోనే వుండిపోయాడు. పైగా అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో నాగం రాజకీయం దాదాపుగా అయిపోయినట్లే, పి. చంద్ర శేఖర్ టీడీపీ నుండి తెరాస లోకి వెళ్లిన అక్కడ టిక్కెట్ రాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కానీ అక్కడ కూడా టిక్కెట్ రాకపోవటంతో ఇప్పుడు బీజేపీ లో ఒక సీనియర్ నేతగా కొనసాగుతున్నాడు. ఇక కాంగ్రెస్ లో చక్రం తిప్పిన జూపల్లి కృష్ణారావు, డీకే అరుణ ఇద్దరు కూడా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయి, జూపల్లి తెరాస లో చేరాడు. డీకే అరుణ బీజేపీ లో చేరింది.

మొన్నటి ఎన్నికల్లో జూపల్లి ఓడిపోవటమే కాకుండా, మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాస కు వ్యతిరేకంగా పనిచేసిన కానీ తెరాస పార్టీ జూపల్లి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో పార్టీలో ఉండాలా, వెళ్లిపోవాలా అనేది ఆయన ఇష్టానికే వదిలేశారు. ఇక డీకే అరుణ అటు గద్వాల్ అసెంబ్లీలో, ఇటు మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ నుండి పోటీచేసి ఓడిపోయారు, దీనితో డీలాపడిన డీకే అరుణ కు తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కటంతో కొంచెం పట్టు నిలుపుకునే పనిలో వుంది.. మరో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల నుండి గెలిచిన కానీ ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వకపోవటంతో, ఆయన నిరాశలో వున్నాడు. రెండు సార్లు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ లక్ష్మారెడ్డి కి ఇక రాజకీయాల మీద మొఖం మొత్తేసిందని స్థానిక నేతలు చెపుతున్నారు. ఇలా ఒకే జిల్లాకు చెందిన ఐదుగురు సీనియర్ మాజీ మంత్రుల యొక్క పొలిటికల్ కెరీర్ ఇలా కావటం బాధాకరం