అచ్చెన్న వ్యూహమేంటి..? అయోమయంలో టీడీపీ శ్రేణులు

achennayudu telugu rajyam

 జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత తెలుగుదేశం పార్టీ తరుపున గట్టిగా వాయిస్ వినిపించిన నేత అచ్చెన్న నాయుడు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటే కూడా అచ్చెన్న సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో, బయట రెచ్చిపోయి మాట్లాడేవాడు. ఒక దశలో సీఎం జగన్ అచ్చెన్న ను నిండు అసెంబ్లీ లో తీవ్ర స్థాయిలో హెచ్చరించే దాక వచ్చింది పరిస్థితి. అలాంటి అచ్చెన్న నాయుడు నేడు వైసీపీ పేరు కానీ, జగన్ పేరు కానీ ఎత్తటానికే భయపడి పోతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి.

achennayudu jagan telugu rajyam

 

 ESI కుంభకోణం కేసులో అచ్చెన్న అరెస్ట్ అయ్యి 2 నెలలు తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన దగ్గర నుండి ఆయన వ్యవహార శైలిలో చాలా మార్పులు వచ్చాయి. దాదాపు బయటకు వచ్చి 40 రోజులు అవుతున్న కానీ ఇంతవరకు జగన్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వుండిపోయాడు. దీనితో అచ్చెన్నకు జైలు జీవితం గడిపిన తర్వాత జగన్ అంటే భయం పట్టుకుంది, ఇక నుండి జగన్ జోలికి వెళ్లకపోవచ్చు అంటూ కొందరు మాట్లాడుతున్నారు, అయితే ఇదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తుంది. అచ్చెన్న నాయుడు మరికొద్ది రోజుల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 ఎప్పుడైతే అధికారంగా ప్రకటిస్తారా అప్పటి నుండి అచ్చెన్న నాయుడు స్వరం గట్టిగా వినిపించబోతుందని, అప్పటిదాకా వేచిచూసే ధోరణిలో ఉన్నాడని, ప్రస్తుతం ఆయనకి ఆరోగ్య పరమైన సమస్యలు కూడా ఉండటంతో పెద్దగా ప్రజా జీవితంలోకి రాలేకపోయాడు తప్పితే, సీఎం జగన్ కు భయపడి కాదంటూ టీడీపీలోని ఒక వర్గం చెపుతున్న మాటలు. ఇవే కాకుండా మరో కీలక విషయం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిజానికి ESI కుంభకోణంలో తనకేమి తెలియదని, అందులో తనకు మిగిలింది కూడా పెద్దగా లేదని, కేవలం తన పేరు అడ్డం పెట్టుకొని కొందరు ఈ పని చేశారని, ఇందులో లోకేష్ బాబు హస్తం కూడా ఉందని, అతన్ని కాపాడటం కోసమే తనను ఇందులో అక్రమంగా ఇరికించారని అచ్చెన్న భావించటంతోనే , పార్టీ కు దూరంగా ఉంటున్నాడంటూ మరో వాదన కూడా వినిపిస్తుంది. మరి వీటిలో దేనికి కూడా బలం చేకూర్చే విధంగా ఇప్పటిదాకా అచ్చెన్న నుండి ఎలాంటి సమాచారం రాలేదు. మరి మున్ముందు అచ్చెన్న నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.