రామతీర్ధం.. గత కొన్ని రోజుల నుంచి ఈ పేరే ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది. ఎందుకు ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. అనే విషయం ఇప్పటికే అందరికీ తెలుసు. ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అతే.. రామతీర్థం ఆలయంలోనూ ఇలాగే దాడి జరిగింది. రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రామతీర్థం కంటే ముందు చాలా ఘటనలు జరిగినప్పటికీ.. ఈ ఘటన మాత్రం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
రాముడి విగ్రహం తల, మొండాన్ని వేరు చేసి.. తలను తీసుకెళ్లి గుడి దగ్గర్లో ఉన్న కొలనులో పడేశారు దుండగలు. ఈ విషయం ఉదయం పూజారి గుడికి వచ్చే వరకు ఎవ్వరికీ తెలియలేదు. ఇక.. ఈ విషయం తెలియగానే.. పార్టీలన్నీ ఆ ఘటనను రాజకీయం చేశాయి.
నిజానికి.. రామతీర్థం ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందట. దాని కోసం సపరేట్ కరెంటు లైన్ వేసి.. ఆలయానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారట. తర్వాత డిసెంబర్ 29న సీసీ కెమెరాలను సెట్ చేసేందుకు కావాల్సిన సీసీ కెమెరాల సెటప్ ను తీసుకొచ్చారాట. కానీ.. 28వ తేదీ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
అంటే.. ఆ ఆలయంలో సీసీ కెమెరాలు బిగిస్తున్నారని తెలుసుకున్న వాళ్లు.. తెల్లారితే సీసీ కెమెరాలు బిగిస్తే.. తమ పని అవదని గ్రహించి.. ముందు రోజు రాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే.. ఇది ఎంతో పక్కా ప్లాన్ ప్రకారం చేసిన పని అని అర్థం అవుతోంది.