వర్షాకాలంలో చర్మం రక్షణ కోసం ఈ ఫేస్ ప్యాక్ లు ఏంతో ఉపయోగపడతాయి…?

సాధారణంగా వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించటం లేదా బ్యూటీ పార్లర్ కు వెళ్లడం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. ఈ వర్షాకాలంలో చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపించడానికి మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకొని వేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఫలితం పొందవచ్చు. చర్మం కాంతివంతంగా యవ్వనంగా కనిపించడానికి ఉపయోగపడే పేస్ ప్యాక్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

• మన ఇంట్లో ఉండే శనగపిండి పసుపు, పెరుగు ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని వేసుకోవడం వల్ల ఇది చర్మ సౌందర్యాన్ని పెంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ముందుగా ఒక కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల సెనగపిండి, చిటికెడు పసుపు, అర టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అంటించి అది ఆరిన తర్వాత చల్లాటి నీటితో మొహం శుభ్రం చేసుకోవాలి. ఇలా సెనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న జడ్డు తొలగిపోయి ముఖం మీద ఏర్పడ్డ ముడతలు తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

• బియ్యం పిండితో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పులో కొంచెం బియ్యం పిండి, కలబంద గుజ్జు,కొంచం తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరచూ బియ్యం పిండితో తయారుచేసిన ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మీద పేరుకుపోయిన మృతకనాలు తొలగిపోయి మొటిమల వల్ల ఏర్పడ్డ నల్ల మచ్చలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తేనె చర్మానికి కావాల్సిన తేమని అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది.

• అంతేకాకుండా ఒక కప్పులో కొంచెం గంధం, కొంచెం పసుపు వేసి అందులో రోజు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసి అది ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల మొటిమలు మచ్చలు తగ్గటమే కాకుండా చర్మం మీద పేరుకుపోయిన దుమ్ము, దూళి తొలగిపోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా యవ్వనంగా కూడా కనిపిస్తారు.