ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన శత్రువు డయాబెటిస్ ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఈ వ్యాధితో పోరాడాల్సిందే. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు.షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మన రోజువారి ఆహారపు అలవాట్లలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధిగ్రస్తులు అత్యధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఇవి రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను మరింత పెంచుతుంది. షుగర్ వ్యాధి రావడానికి కారణాల్లో ఒకటైన కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అతి బరువు సమస్య ఏర్పడి షుగర్ వ్యాధి తీవ్రతను మరింత పెంచుతుంది. కావున అత్యధిక ప్రోటీన్స్ ,కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండడమే మంచిది.
గ్లూకోజ్ తక్కువగా ఉంది అత్యధిక పీచు పదార్థం ఉన్న
ఆపిల్, ద్రాక్ష, నారింజ, బెర్రీ , డ్రై ఫ్రూట్స్ వంటి ఆహారం ఎక్కువగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉన్న పీచు పదార్థం రక్తంలో చక్కెర నిల్వలను తగ్గించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. వైట్ రైస్ కు బదులు అత్యధిక ఫైబర్ ఉన్న చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం మంచిది.అలాగే ప్రతిరోజు కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, నడక వంటివి చేస్తే కొలెస్ట్రాల్ శాతం తగ్గి షుగర్ వ్యాధినీ కూడా అదుపులో ఉంచుకోవచ్చు.
డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు కొలెస్ట్రాల్ మరియు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే పిజ్జా, బర్గర్,
ఫ్రైడ్ రైస్, ప్రెంచ్ ఫ్రైస్, డోనట్స్,సాఫ్ట్ డ్రింక్ వంటి ఫాస్ట్ ఫుడ్ ను అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి ఉబకాయ సమస్య ఏర్పడుతుంది దాంతో డయాబెటిస్ వ్యాధి కూడా అదుపులో ఉంచడం సాధ్యం కాదు. ఎండుద్రాక్ష, బంగాళాదుంప, అరటిపండు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచుతాయి.మధుమేహంతో బాధపడేవారు ఒక శాతం కంటే తక్కువ కొవ్వు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే వీటిలో ఉన్న
స్యాచురేటెడ్ ప్యాట్స్ ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున వీటిని తినకపోవడమే మంచిది.