ఇంత పెద్ద భారతదేశానికి ఒకటే రాజధానా? ఎందుకు ఒకటే రాజధాని ఉండాలి. నాలుగు రొటేటింగ్ రాజధానులు భారత్ కు ఉండాలి.. అంటూ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అప్పట్లో బ్రిటిషర్లు.. కోల్ కతాను రాజధానిగా చేసుకొని రాజ్యమేలారు. అటువంటప్పుడు దేశంలో ఒకే ఒక్క రాజధాని ఎందుకు ఉండాలి.. అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు.
ఈసందర్భంగా… కోల్ కతాలో టీఎంసీ భారీ ర్యాలీ జరిగిన సందర్భంగా… మమతా బెనర్జీ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 125వ జయంతి ఉత్సవాన్నే దేశ్ నాయక్ దివాస్ గా మనం జరుపుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను దేశ్ నాయక్ గా రవీంద్రనాథ్ ఠాగూర్ సంబోధించారంటూ ఆమె ఈసందర్భంగా గుర్తు చేశారు. నేతాజీ.. భారత నేషనల్ ఆర్మీని స్థాపించి.. గుజరాత్, బెంగాల్, తమిళనాడు ప్రజలనే కాదు.. ప్రతి ఒక్కరిని ఆర్మీలో తీసుకున్నారని… బ్రిటిషర్లకు ఎదురొడ్డి పోరాటం సాగించిన ధీరుడు.. నేతాజీ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
అలాగే.. కేంద్రంపై కూడా మమతా బెనర్జీ విమర్శల వర్షం కురిపించారు. ఆజాద్ హింద్ స్మారకాన్ని మనం నిర్మించుకుందామని… కేంద్రం మాత్రం… కేవలం పార్లమెంటు కాంప్లెక్స్ నిర్మాణాల కోసమే వేల కోట్లను ఖర్చు చేస్తోందంటూ దుయ్యబట్టారు.
నేతాజీ మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయిందని.. ఆయన పుట్టిన రోజు గురించి మాత్రమే మనకు తెలుసన్నారు. అయితే.. నేతాజీపై కొందరు కావాలని ఎన్నికల్లో గెలవడం కోసమే సంబురాలు నిర్వహిస్తున్నారంటూ కేంద్రాన్ని విమర్శించారు.