రూటుమార్చిన వంశీ ..వ్రతం చెడ్డా.. ఫలితం దక్కేనా..?

vamsi babu telugu rajyam

 గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మీడియాలో పెద్ద ఎత్తున దుమారమే రేగుతుంది. టీడీపీ నుండి వైసీపీ లోకి వెళ్లి గన్నవరం నియోజకవర్గంలోని స్థానిక నేతలతో గిల్లిగజ్జాలు పెట్టుకుంటున్నాడని, ఈ విషయంలో అతనిపై వైసీపీ అధిష్టానం గుర్రుగా ఉందని కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజాగా వంశీ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

vallabhaneni vamshi telugu rajyam

 

  కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే ఉంటున్న బాబు చాలా రోజుల తర్వాత అమరావతి పర్యటనకు రాబోతున్నాడు, దీనితో వంశీ మాట్లాడుతూ “ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరదేశి అని, అజ్ఞాతవాసి అని, తెలంగాణ రాష్ట్ర నివాసి” అని ఘాటు విమర్శలు చేశారు. “మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పర్యటన సందర్భంగా స్వాగతం సుస్వాగతం” అంటూ సెటైర్స్ వేశారు. దీనితో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే వుంది. అయితే వంశీ ఇప్పుడు మరోసారి బాబు మీద కౌంటర్లు వెనుక మరో కోణం దాగివుండేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. వైసీపీలో వల్లభనేని వంశీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కలేదు . గుర్తింపు విషయం పక్కన పెడితే వంశీ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నుండి వంశీని పంపించటానికి తెరవెనుక మంతనాలు గట్టిగానే జరుగుతున్నాయి.

  దీనితో ఎలాగోలా అధినేత జగన్ దృష్టిలో పడి, పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనే ఆలోచనలో వంశీ వున్నాడు. అదే సమయంలో వైసీపీ లో కమ్మనేతగా ఉండి, రాజకీయ విమర్శలు చేసే కొడాలి నాని ఈ మధ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం లేపటంతో సైలెంట్ అయ్యాడు. ఇదే అదునుగా భావించిన వంశీ ఆ స్థానంలో తాను చంద్రబాబును టార్గెట్ చేస్తే వైసీపీ లో ఈజీ గా గుర్తింపు వస్తుందని భావించి బాబుపై విమర్శలు ఎక్కుపెట్టినట్లు తెలుస్తుంది. ఏ కులానికి చెందిన నేతను అదే కులం కలిగిన నేతతో విమర్శలు చేపించటం రాజకీయంలో మాములే.. దానినే ఇప్పుడు వంశీ తానకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తుంది. మరి వల్లభనేని వంశీ పడుతున్న ఈ రకమైన కష్టాన్ని వైసీపీ అధినేత గుర్తిస్తాడో లేడో