Suresh Babu: ప్రభుత్వంతో చర్చలు జరిపాము. ల్యాండ్ ఇస్తామన్నారు. కానీ మేమే తీసుకోలేదు

Suresh Babu: అప్పట్లో తన నాన్న గారిని రాజకీయాల్లోకి వెళ్లేలా తానే ఎక్కువ ప్రోత్సహించానని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అన్నారు. అన్ని పార్టీల వాళ్లకు వీడియోలు కూడా చేసి ఇచ్చేవాడినని ఆయన తెలిపారు. ఆ సమయంలోనే మా నాన్నను పాలిటిక్స్‌లోకి వెళ్లండి అని చెప్పినట్టు సురేశ్ బాబు అన్నారు. అలా టీడీపీకి వెళ్లిన తర్వాత అనుకున్నట్టుగానే పోటీ చేశాము. గెలిచాము కూడా, కానీ తాను అనుకున్న పాలిటిక్స్ వేరు.. అక్కడ జరిగేది వేరు అని ఆయన చెప్పుకొచ్చారు. ఓ 15 రోజులు గడిచిన తర్వాత అసలు తాము కాంగ్రెస్‌తో ఫైట్ చేస్తున్నామా? లేదంటే టీడీపీ వాళ్లతో ఫైట్ చేస్తున్నామా ? అని అనిపించినట్టు ఆయన అన్నారు.

గవర్నమెంట్‌గా వారు స్కిల్స్‌ను డెవలప్ చేయాలని, ఒక సినిమా తీయాలంటే చాలా స్కిల్స్ కావాలని, వాటిని డెవలప్ చేయాలంటే కొన్ని కేటగిరీస్‌లలో ప్రత్యేక శిక్షణలు ఇప్పించాలని తాము కోరినట్టు ఆయన తెలిపారు. కావాలంటే ప్లాన్ చేయండి అని వారు అన్నారు. అంతే కాకుండా ల్యాండ్ కూడా అలాట్ చేశారని, కానీ దాన్ని తాను తీసుకోలేదని ఆయన అన్నారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీని తీసుకురావాలనుకోవడం అనేది చిన్న విషయం కాదన్న ఆయన, మద్రాస్‌ నుంచి ఇక్కడి వరకు వచ్చామంటే చాలా మంది దానికి కృషి చేశామని, దాన్ని వాళ్లు కేవలం సెట్ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటికీ కొన్ని సామాగ్రిని మద్రాస్‌నుంచి తెచ్చుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు ఇండస్ట్రీ రావడం చాలా అవసరం అని సురేశ్ బాబు చెప్పారు. ఎందుకంటే ఎన్ని చోట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే అక్కడ లోకల్ టాలెంట్‌కి చాలా అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా ఉంది కాబట్టి చాలా రకాలుగా సెలక్షన్ జరుగుతుందన్న ఆయన, ఒకవేళ మంచి మౌళిక వసతులు కూడా ఉన్నట్టయితే ఇంకా ఎంతో టాలెంట్‌ను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.