Home News గ్రేటర్ మేము లేట్ అంటున్న తెరాస.. కేటీఆర్ వ్యూహం ఫలించేనా..?

గ్రేటర్ మేము లేట్ అంటున్న తెరాస.. కేటీఆర్ వ్యూహం ఫలించేనా..?

 గ్రేటర్ ఎన్నికల హడావిడి మొదలైంది. స్థానిక ఎన్నికలంటే గల్లీ గల్లీలో రాజకీయ వేడి రాజుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కడ చూసిన ఈ ఎన్నికల గురించే చర్చ నడుస్తుంది. ఇక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. సరైన అభ్యర్థి ఎవరు..? అతనికి ఉన్న విజయావకాశాలు ఏమిటి..? అతని మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయా..? ఎన్నికల్లో ఎంతవరకు డబ్బు పెట్టగలడు అనే అంశాలను పార్టీలన్నీ పరిశీలిస్తున్నాయి.

Ministar Ktr

 ముఖ్యంగా అధికార తెరాస పార్టీ చాలా రోజుల నుంచి కసరత్తులు మొదలు పెట్టంది. కానీ అభ్యర్థుల జాబితా రిలీజ్ చేయడం లేదు. ఎందుకంటే ఎవరు నీతిమంతులో, ఎవరు గెలుస్తారో టీఆర్ఎస్ తెలియడం లేదట.సర్వే రిపోర్టుల ఆధారంగానే పది నుంచి ఇరవై సీట్లలో మార్పులు ఉంటాయని కేటీఆర్ చెప్పారట. ఇందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో అనుకున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

 అలాగే అభ్యర్థుల జాబితాను విడుదల చేయకపోవటానికి రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ మార్చాలనుకున్న అభ్యర్థుల మీద అవినీతి ఆరోపణలు రావటం ఒక కారణం అయితే.. రెబెల్స్ ముప్పు లేకుండా చేసుకోవటం మరో కారణమని తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ నిన్న విడులైంది. నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలై.. శుక్రవారం సాయంత్రం నాటికి ముగుస్తోంది. అంటే.. కేవలం మూడు రోజుల మాత్రమే. ఇంత తక్కువ సమయం ఉన్నప్పుడు అభ్యర్థుల జాబితాను ప్రకటించాలి.

 అలా చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో.. ఈ రోజు యాభై నుంచి అరవై మంది వరకు.. గురువారం మరికొందరిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇలా చేయటం వలన టిక్కెట్ రాని నేతలు రెబల్స్ గా మారటానికి సమయం ఉండదు, అదే విధంగా పక్క పార్టీలోకి వెళ్ళటానికి కూడా కుదరకపోవచ్చు, అందుకే సమస్యాత్మకంగా అనిపించిన డివిజన్స్ విషయంలో అభ్యర్థుల ప్రకటన ఆలస్యంగా రావచ్చని తెలుస్తుంది. ఇందంతా ఒక వ్యూహం ప్రకారం కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తుంది.

 

- Advertisement -

Related Posts

కుప్పంలో వైసీపీని చూసి పెద్దిరెడ్డి షాక్.. ఆయన ముందే గొడవలు ?

చంద్రబాబు నాయుడుకు అధికారం పోయిందనే బాధ ఒక ఎత్తైతే అంతకు మించిన బాధ ఇంకొకటి ఉంది.  అదే కుప్పంలో మెజారిటీ తగ్గడం.  30 ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడుకు గతంలో ఏనాడూ మెజారిటీ తగ్గిన దాఖలాలు లేవు. ...

కేటీఆర్ సీఎం అయితే పార్టీలో అణుబాంబు పేలుతుంది .. బండి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ  సీఎంగా మంత్రి కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద చర్చే నడుస్తోంది. సొంతపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కానున్నారని బహిరంగ వేదికలపైనే వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ సీఎం అయితే...

పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సంపూర్ణేష్‌.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం

ఒక‌ప్పుడు డూపుల‌తో స్టంట్స్ చేసే మ‌న హీరోలు ఇప్పుడు ఎవ‌రి సాయం అవ‌సరం లేద‌న్న‌ట్టు యాక్ష‌న్ సీన్స్‌లోకి బ‌రిలోకి దిగుతున్నారు. ఇటీవ‌ల అజిత్ ఓ యాక్ష‌న్ సీన్ లో భాగంగా పెద్ద ప్ర‌మాదం...

నిమ్మగడ్డ తమకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు అని ఆనందించేలోపు చంద్రబాబు కి షాక్ !

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం జెడ్పీటీసీ...

Latest News