తారక్ ప్రణతి వివాహం వెనుక ఇంత కథ నడిచిందా… ఆయనే ముందుండి నడిపించారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 2011 మే 5వ తేదీ లక్ష్మీ ప్రణతి మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇలా 11 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న ఎన్టీఆర్ ఒకవైపు సినిమాలలో దూసుకుపోతూనే మరోవైపు తన కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ప్రణతి సైతం కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ నందమూరి కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వస్తున్నారు. ఇకపోతే ప్రణీత ఎన్టీఆర్ వివాహం వెనుక పెద్ద స్టోరీనే నడిచిందనే విషయం చాలామందికి తెలియదు.

ఈ విధంగా ఎన్టీఆర్ పెళ్లి వెనుక ఉన్న ఆ స్టోరీ ఏంటి ఎవరు ఎన్టీఆర్ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించారనే విషయానికి వస్తే…ఎన్టీఆర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సమయంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేత కుమార్తెను ఎన్టీఆర్ కు ఇచ్చి వివాహం చేయాలని భావించారు. అయితే విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వేరొకరి ఇంటికి అల్లుడు అవడం ఇష్టం లేక ఆయన రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ మేనకోడలు కుమార్తెను ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు.ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ పెళ్లికి పెద్దగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు.ఇక ప్రణతి కుటుంబం కూడా బాగా సంపన్నులే వీరికి హైదరాబాదులో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి.ఇక ఎన్టీఆర్ కి ప్రణతి సైతం నచ్చడంతో వీరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే అప్పుడు లక్ష్మీ ప్రణతి మైనారిటీ కూడా పూర్తికాకుండానే పెళ్లి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆమెకు 18 ఏళ్లు పడిన తర్వాతనే వివాహం చేశారు. ఇకపోతే పెళ్లిలో ప్రణతి ఎన్టీఆర్ కి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను కట్నంగా తీసుకువచ్చిందని తెలుస్తోంది.ఇలా ఎన్టీఆర్ పెళ్లి వెనుక చంద్రబాబు నాయుడు ముందుండి నడిపించారని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రిబుల్ ఆర్ సినిమాతో మంచి హిట్ కొట్టడంతో తన తదుపరిచిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి లండన్ వెకేషన్ లో ఉన్నారు.