చైనాతో యుద్ధానికి భారత్ సిద్దంగా ఉంది. తొలుత కయ్యానికి కాలు దువ్వింది చైనానే. ఆ పైనే భారత్ ఢీ అంటే ఢీ! అంటూ వార్ కి రెడీ అయింది. గాల్వానా లోయలో జరిగిన ఘర్షణతో ఈ వార్ కి నాంది పడింది. నాటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల సైనిక అధికారులు చర్చించుకున్నా..చర్చలు సఫలమైనా! చైనా ఎల్ ఓసీ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. దీంతో లాభం లేదని భావించిన ప్రధాని మోదీనే శుక్రవారం నేరుగా లద్దాఖ్ సరిహద్దులో దిగిపోయారు. దీంతో డ్రాగన్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓవైపు సైనిక, దౌత్య పరమైన చర్చలు జరుగుతున్నా మోదీ! ఇలా సైనికులతో భేటీ అవ్వడం పట్ల అభ్యంతరం, అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆదేశ విదేశాంగ శాఖ.
చైనా నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని భావించే మోదీ సీన్ లోకి దిగారన్నది నిపుణుల మాట. భారత సైనిక సామర్ధ్యం గురించి దిక్కులు పిక్కటిల్లేలా గర్జించి చెప్పారు. యుద్ధానికి భారత్ సిద్దంగా ఉంది. మీరు సిద్దంగా ఉన్నారా? లేదా? అని స్పష్టమైన సంకేతాలు చైనాకి పంపారు మోదీ. ఇప్పటికే భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు పెద్ద ఎత్తున లభిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, జపాన్, బ్రిటన్, ప్రాన్స్ దేశాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాయి. ఇక చైనాకు పాకిస్తాన్ అండగా నిలిచింది. కానీ భారత్ ఒంటరిగానే డ్రాగన్ కు బుద్ది చెప్పాలని భావిస్తోంది. అవసరమైతేనే ఇతర దేశాల సహాయం తీసుకోవాలనుకుంటోంది.
ఇప్పటివరకూ జరిగిన యుద్ధాలలో భారత్ దే పైచేయి. చైనాతో ఓటమీ ఎదురైనా భారత బలగాలు దాడికి తెగబడితే ఎలా ఉంటుందన్నది ప్రత్యర్ధులుకు బాగా తెలుసు. అందుకే చైనా కవ్వింపులకు దిగుతోంది తప్ప! యుద్ధమంటే బెదిరే పరిస్థితే కనిపిస్తోంది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ తో రణమా ? శరణమా అన్నది ! అన్నది తుదిగా తేల్చుకోవాల్సింది చైనా మాత్రమే. కయ్యానికి కాలు దువ్వింది చైనానే..ఇప్పుడు వెనక్కి తగ్గినా భారత్ తో శరణు కోరినట్లే. భారత్ ఇప్పటికే యుద్ధానికి అవసరమైన సరంజామాని సరిహద్దులకు జోరుగా తరలిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన కొత్తగా విదేశీ టెక్నాలజీ రఫెల్ యుద్ధ విమానాలను ప్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తోన్న సంగతి తెలిసిందే.