గాల్వానా ఘటన తర్వాత భారత్-చైనా ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం గురించి తెలిసిందే. ఇరు దేశాలు ఢీ అంటూ ఢీ అంటూ యుద్ధానికి సిద్దమయ్యాయి. తాడో..పేడో ? తేల్చుకోవలనుకున్నాయి. ఇంతలో ఓ వైపు చర్చలు జరుగుతున్నా హఠాత్తుగా గుడారాలు పీకేసీ డ్రాగన్ దేశం దూకుడు తగ్గించింది. దీంతో భారత బలాగాలు స్పాట్ నుంచి వెనుదిరిగాయి. ఈ నేపథ్యంలో తాత్కాలి కంగా యుద్ధం లేనట్లేనని అనిపించింది. కానీ చైనాకి నోటితో నవ్వుతూ నొసటితే వెక్కిరించే బుద్ది అనేది ఒకటుంది కాబట్టి! మళ్లీ వక్ర బుద్ధిని చూపిస్తోంది. తాజాగా మళ్లీ ఇరు దేశాలు యుద్ధానికి రెడీ అవుతున్నాయి.
సరిహద్దు బలగాల ఉపసంహరణకు సరేనని చెబుతూనే! డ్రాగన్ దేశం మళ్లీ మాట తప్పింది. 65000 చదరపు కిలోమీటర్లు తమేదానంటూ బుకాయిస్తోంది. ఈ నేపథ్యంలోనే అరుణా చల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ దిశగా 40 వేల సైనికుల్ని మోహరించింది. యుద్ధానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంది. హాట్ర్సిగ్స్, గోగ్రా పోస్ట్ ప్రాంతాల్లో భారీగా నిర్మాణాలు చేపట్టింది. దీంతో భారత్ కూడా భారీగా బలగాల్ని తరలిస్తోంది. యుద్ధ సామాగ్రిని భారీ ఎత్తున అరుణాచల్ కు తరలిస్తోంది. ఈశాన్య రాష్ర్టాల్లోని శాంతియుత ప్రాంతాల నుంచి రిజర్వ్ బలగాల్ని సమీకరిస్తోంది. సాధారణంగా ఈనెలల్లో అరుణచల్ వైపుకు ఈ సమయంలో బలగాల తరలింపు ఉంటుంది.
కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్ భారీగా తరలిస్తోంది. అలాగే రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఎయిర్ ఫోర్స్ సేవల్నీ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తూర్పు లద్దాఖ్ లో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు వైమానిక దళం వేగంగా యుద్ధ విమానాలను మోహరించడాన్ని ప్రశంసించారు. భారత సన్నద్ధతను చూసి శత్రుదేశం గుండెల్లో ఒణుకు పుట్టిందని వ్యాఖ్యానించారు.