జగన్ పరువు తీసేసిన వాలంటీర్లు – ఇదెక్కడి గొడవరా బాబు !

jagan

 జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో హడావిడిగా వాలంటీర్లు వ్యవస్థ ప్రవేశపెట్టింది. ‌ప్రతి గ్రామంలో ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఓ వ‌లంటీర్ ను ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ప‌ని ఈ వ‌లంటీర్ల ద్వారానే జ‌రిగేలా చేశారు. రేష‌న్ కార్డులు, ఫించ‌న్లు, ఇత‌ర అవ‌స‌రాలు.. అధికారుల‌తో ప‌నుల ద‌గ్గ‌ర నుంచి అన్నీ వ‌లంటీర్ల చేతుల మీద‌గానే జ‌రుగుతున్నాయి. చివ‌ర‌కు కొన్ని ప‌నుల‌కు వ‌లంటీర్ల సంత‌కం త‌ప్ప‌కుండా ఉండాల్సిందే.

jagan

 అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ పట్ల వైసీపీ నేతలే కొన్ని కొన్ని సందర్భాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ల వ‌ల్ల ఎమ్మెల్యే ల‌తో సంబంధం లేకుండా ప‌నులు అవుతుండ‌డంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు కాద‌న్న వారికి కూడా ప‌నులు అవుతున్నాయ‌న్న ఆగ్ర‌హం ఎమ్మెల్యేల్లో ఉంది. ఇక వైసీపీ జనాలు తాము ప్రవేశపెట్టిన విధానాన్ని బెంగాల్‌, కేర‌ళ రాష్ట్రాలు సైతం ఈ వ్య‌వ‌స్థ‌ను అక్క‌డ ఇంప్లిమెంట్ చేసే ప్ర‌య‌త్నం చేశార‌న్న ప్ర‌చారం కూడా చేసుకున్నారు.

 ఈ వ్యవస్థపై రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఈ వ‌లంటీర్లే వార్డుల నుంచి.. బూత్ ల వ‌ర‌కు వైసీపీకి ఎన్నిక‌ల ప్ర‌చార క‌ర్త‌లుగా ఉంటార‌ని.. వీళ్లే స్వ‌యంగా త‌మ ప‌రిధిలో ఉన్న 50 కుటుంబాల వారితో పార్టీకి ఓట్లు ప‌డేలా చేసేలా జ‌గ‌న్ ప్లాన్ చేశార‌ని విశ్లేషించారు. అయితే వచ్చే ఎన్నికల నాటికీ కాకుండా ప్రస్తుతం జరుగుతున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వ‌లంటీర్లే వైసీపీ త‌ర‌పున స‌ర్పంచ్ , వార్డు మెంబ‌ర్లుగా పోటీ చేస్తున్నారు. మ‌రి కొన్ని చోట్ల అధికార పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌పున ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

 తాజాగా అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం నియోజకవర్గ, బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గా వైసీపీ అభ్యర్థి నామినేషన్లు దాఖలు చేయడానికి వ‌చ్చారు. అయితే ఇక్క‌డ వ‌లంటీర్లు ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కారు. స‌ర్పంచ్ అభ్య‌ర్థి నామినేషన్ పత్రాలను గ్రామానికి చెందిన వాలంటీర్లు ప్రదీప్, ప్రకాష్ లు ద‌గ్గ‌రుండి మ‌రీ పూర్తి చేశారు.ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ సైతం వ‌లంటీర్లు ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ కూడ‌ద‌ని.. ప్ర‌చారం చేయ‌కూడ‌ద‌ని.. వాళ్ల ఫోన్లు కూడా ఇచ్చేయాల‌ని చెప్పారు. అయితే ఈ వ‌లంటీర్ల‌లో దాదాపు గా అంద‌రూ వైసీపీ సానుభూతి ప‌రులే ఉండ‌డంతో వీళ్లు నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కి మ‌రీ అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.