విశాఖ ఆర్కే బీచ్ లో తప్పిపోయి ప్రియుడుతో కలిసి ఇంటికి చేరుకున్న విష్ణు ప్రియ?

ప్రస్తుత కాలంలో యువతీ యువకులు అన్ని విషయాలలోనూ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ పెళ్లి పేరుతో ఎంతోమంది అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. ఇటీవల విశాఖపట్నం ఆర్కే బీచ్ లో తప్పిపోయిన విష్ణు ప్రియ వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల విశాఖ నగరానికి చెందిన విష్ణు ప్రియ పెళ్లి రోజు సందర్భంగా తన భర్తతో కలిసి సాయంత్రం ఆర్కే బీచ్ కి వెళ్ళింది. విష్ణు ప్రియ దంపతులు చాలా సమయం బీచ్ లో గడిపారు. దాదాపు 7 గంటల ప్రాంతంలో విష్ణుప్రియ కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త చాలా సమయం బీచ్ లో ఆమె కోసం వెతికాడు.

అయినప్పటికీ ఆమె కనిపించకపోయేసరికి సముద్రపు నీటిలో గల్లంతు అయ్యిందేమో అని అనుమానంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డ్ టీమ్‌లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినప్పటికీ విష్ణు ప్రియ జాడ తెలియలేదు. దీంతో విష్ణు ప్రియ మిస్సింగ్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. కానీ రెండు రోజులు తర్వాత నెల్లూరులో విష్ణు ప్రియ తన ప్రియుడితో కలిసి ఉన్నట్టు తెలిసింది. అక్కడ ఉంటె వారికి ప్రమాదమని భావించి ఇద్దరు బెంగళూరు వెళ్లి పెళ్లి చేసుకొని ఆమె తల్లి తండ్రులకు ఫోటోలు పంపారు. అయితే విష్ణు ప్రియని వెతకటం కోసం ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు చేసింది.

కానీ ఆమె మాత్రం అందరి కళ్ళు గప్పి ప్రియుడితో కలిసి బెంగళూరు చెక్కేసింది. ఈ క్రమంలో విష్ణు ప్రియ భర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు బెంగళూరులో సాయిప్రియ, ఆమె ప్రియుడు ఉన్న లోకేషన్ ట్రేస్ చేసి శుక్రవారం రాత్రి వారిని విశాఖకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారని సమాచారం . సాయిప్రియను ఆమె ప్రియుడిని పోలీసులు విశాఖపట్నం తీసుకురావడంతో వారిని చూసేందుకు ప్రజలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు వస్తున్నారు. అంతేకాకుండా ఆమెను వెతకటం కోసం ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు చేయడంతో ప్రభుత్వానికి ఇంత నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనతో విశాఖలో ఆందోళన వాతావరణం నెలకొంది.