AP: జగన్ కారణంగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది…. కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు!

AP: గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను కూడా తీసుకువచ్చారు.. అయితే ఆయన చేసిన మంచిని చెప్పుకోవడంలో విఫలమయ్యారా అంటే అవునని చెప్పాలి. అయితే ప్రస్తుతం కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని కూటమినేతలు ఒక్కొక్కరుగా బయట పెట్టడం విశేషం.

ఇటీవల కర్నూలు పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రీన్ కో సమస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ జగన్ చేసిన మంచి పనులను బయటపెట్టారు. అయితే తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు విశాఖ ఉక్కు పై ఎన్నో విష ప్రచారాలు చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయామంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధమయ్యారు అంటూ జగన్ పై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ విషయంపై మాట్లాడుతూ… నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని స్వయంగా మంత్రి చెప్పారు.

నాటి నుంచి ప్రైవేటీకరణ జరగకుండా గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. వైఎస్సార్‌సీపీ సఫలీకృతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్, కార్మికుల ఒత్తిడితో చివరికి ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం… పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిందని తెలియజేశారు. ఇలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడం కోసం వైఎస్సార్సీపి ఎంతో కృషి చేయగా ఇప్పుడు మాత్రం ఆ క్రెడిట్ మొత్తం కూటమినేతల తమ ఖాతాలో వేసుకుంటున్నారని చెప్పాలి.