పోలీస్ స్టేషన్ లో కోహ్లీ తోలి ఆడీ కారు !

విరాట్ కోహ్లీ .. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ .. పరుగుల యంత్రం. దేశం ఏదైనా , బౌలర్ ఎవరైనా , గ్రౌండ్ ఎక్కడైనా పరుగుల సునామి సృష్టించే సత్తా ఉన్న ఆటగాడు. అతి తక్కువ వయస్సులోనే ఎన్నో రికార్డ్స సృష్టించిన కోహ్లీ , ఇండియన్ టీం ను ముందుండి నడిపిస్తున్నాడు.

ఇకపోతే , విరాట్ కోహ్లీ వాడిన తొలి ఆడీ కారు ఏడాదిగా పోలీస్ స్టేషన్ డంప్ యార్డు వుంది. చాలా సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆడీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆడీ ఆర్8 వీ10 లగ్జరీ కారును ఆ సంస్థ కోహ్లీకి కానుకగా ఇచ్చింది.
ఆ తరువాత కొంత కాలానికి కోహ్లీ ఆ కారును సాగర్ థక్కర్ అనే వ్యక్తికి అమ్మేశాడు. తాను కోహ్లీ నుంచి కొన్న కారును సాగర్, తన గర్ల్ ఫ్రెండ్ కు బహుమతిగా ఇచ్చాడు.

కానీ, అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. దాదాపు రూ. 12 కోట్ల స్కామ్ లో సాగర్ పోలీసులకు పట్టుబడటంతో, అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, కోహ్లీ వద్ద కొన్న ఆడీ కారును కూడా సీజ్ చేశారు. ఈ కారును తీసుకెళ్లి థానే పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఇది ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దుమ్ము పట్టేసింది. ఈ కారును గుర్తించిన ఓ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్, దీన్ని ఫోటో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయింది