విరుష్క కూతురు పేరేంటో తెలుసా !

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మ ఈ మద్యే తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందారు. ఇటీవలే అనుష్క పడ్డంటి ఆడబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించాడు. ‘మాకు పాప జన్మించిందనే విషయాన్ని పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నా. మీ ప్రేమకు, ప్రార్థనలకు, అభినందనలకు కృతజ్ఞతలు చెబుతున్నాం’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.

దీంతో కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్‌లు చేశారు. అయితే తాజాగా అనుష్క శర్మ తమ కూతురి పేరును వెల్లడించింది. వామిక అని పేరు పెట్టినట్లు ట్విట్టర్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను అనుష్క శర్మ షేర్ చేసింది. ఇందులో అనుష్క, కోహ్లీ తమ పాపను చేతిలో పట్టుకుని ఉన్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ‘వెల్ కమ్ వామిక’ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.