వైరల్ వీడియో.. బస్సులో మద్యం సేవించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు!

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉండటంతో దూరప్రాంతాలలో జరిగే విషయాలు, ఘటనలు కూడా వెంటనే తెలిసిపోతున్నాయి. అలా తాజాగా ఓ విద్యార్థుల వీడియో ఒకటి వైరల్ గా మారింది. అందులో కొంతమంది విద్యార్థులు బస్సు లో మద్యం తాగుతూ కనిపించారు.

తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు.. మంగళవారం రోజు బస్సులో తిరుకజుకుండ్రం నుంచి తాచూర్ కు వెళ్తున్న సమయంలో బీర్ బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ కనిపించారు. ఇక ఈ వీడియోను తోటి విద్యార్థులు రికార్డ్ చేయటంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో మారింది. దీంతో ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం ఈ ఘటన గురించి విచారణ జరుపుతున్నారు.