Madhya Pradesh CM : వైరల్ : సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ప్రభాసే..ఎంపీ సీఎం సంచలన స్టేట్మెంట్.!

Madhya Pradesh CM : ప్రస్తుతం భారతీయ సినిమా దగ్గర ఇప్పుడు తెలుగు సినిమా నమోదు చేస్తున్న అద్భుతాల కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా దశ అంతా కూడా వండర్ ఫుల్ క్రియేటర్ ఎస్ ఎస్ రాజమౌళి తీసిన భారీ సినిమాలు “బాహుబలి” సినిమాలతో అదరగొట్టారు. ఇక ఇక్కడ నుంచి ఈ దర్శకుడు అలాగే ఈ సినిమా హీరో ప్రభాస్ ల పేర్లు అయితే దేశ వ్యాప్తంగా మారు మోగిపోయాయి.
అలాగే బాహుబలి సినిమాలతో భారతదేశ వ్యాప్తంగా ప్రభాస్ కలిగించిన ప్రభావం కూడా అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు ఏకంగా మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శివాజీ రాజ్ సింగ్ చౌహన్ లేటెస్ట్ గా ఓ మీటింగ్ ప్రభాస్ కోసం కొన్ని సంచలన స్టేట్మెంట్స్ సినీ వర్గాల్లో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
తాను మాట్లాడుతూ ఇప్పుడు టాలీవుడ్ సినిమా బాలీవుడ్ కన్నా గొప్పగా మారింది అని. అది బాహుబలి లాంటి సినిమాల మూలానే సాధ్యపడింది అని తాను తెలిపారు. అలాగే ఒకప్పుడు తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చింది సీనియర్ ఎన్టీఆర్ అయితే ఇప్పుడు అంతలా ప్రభాస్ గుర్తింపు తీసుకొచ్చాడని తాను తెలిపారు.
దీనితో మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగా మారగా ప్రభాస్ అభిమానులు అయితే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందంతో కాలర్ ఎగరేస్తున్నారు.
https://twitter.com/MP_MyGov/status/1515327824487665666?s=20&t=i58p4JUV-Zs-CXaCUwB6Uw