Ambanti: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి వారిలో విజయసాయిరెడ్డి ఒకరు అయితే విజయ్ సాయి రెడ్డి ఇటీవల రాజకీయాలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఇకపై ఏ పార్టీలోకి చేరనని వ్యవసాయం చేసుకుంటానని మాట్లాడారు అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి విజయ్ సాయి రెడ్డి ఇటీవల తాను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చానో కూడా తెలియజేశారు.
నేను రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఎంతో విశ్వసనీయతతో ఉన్నాను. కానీ కొంతమంది రాజకీయపరంగా ఎదుగుదల కోసం తనపై లేనిపోని విమర్శలు చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ కారణంగానే ఆయనకు ఈ పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీ నుంచి బయటపడతారో అప్పుడే ఆయన నాయకుడిగా సక్సెస్ అవుతారు అంటూ విజయ్ సాయి రెడ్డి మాట్లాడారు.
ఈ విధంగా విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబంటి రాంబాబు సైతం స్పందించారు. జైలులో రిమాండ్ లో ఉన్న పోసాని కృష్ణ మురళితో అంబంటి రాంబాబు మూలాకత్ లో భాగంగా తనని కలిశారు. ఇలా ఆయనని కలిసిన అనంతరం మీడియా సమావేశంలో భాగంగా విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలపై కూడా స్పందించారు. ఈ సందర్భంగా అంబంటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే కక్షపూరిత అరెస్టులు చేస్తున్నారని తెలిపారు.
నేను మాట్లాడుతున్నా.. నాపై కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓటరి ఉందంటే అది విజయసాయి రెడ్డి మాత్రమేనని తెలిపారు. విజయసాయిరెడ్డి రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఎంతో ఉన్నత పదవులను తీసుకున్నారు రాజకీయాలలోకి రాకముందు ఆయన కేవలం ఒక ఆడిటర్ మాత్రమేనని తెలిపారు. ఇక విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా కూడా ఉన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కోటరీ అంటే విజయసాయి రెడ్డి అని, ఆయన పార్టీ నుంచి బయటకు పోయారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటరీ నుంచి బయటకు వచ్చినట్లేనని తెలిపారు. విజయ సాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇది ఆయనకు మంచిది కాదని ఈ సందర్భంగా అంబంటి రాంబాబు తెలిపారు.