అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారిందంటున్న విజయసాయిరెడ్డి!

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేస్తున్న వ్యాఖ్యల గురించి విమర్శలు చేశాడు. అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారిందని.. మెదడుకి, నాలుకకు మధ్య హుందాతనం అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు అని అన్నాడు.

అంతేకాకుండా వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు అంటూ.. ఓటమి తెచ్చినా ఫ్రస్టేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే మారిందని అన్నాడు. అంతేకాకుండా దావోస్ వెళ్లిన జగన్ పై వస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చాడు. దావోస్ వెళ్ళిన బాబు ఏం చేసాడో.. ఏం తీసుకొచ్చాడో ఎవరూ పట్టించుకోలేదని.. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసి వచ్చాడని అర్థం అవుతుందని అన్నాడు.