పడకగదిలో భార్య మిమ్మల్ని దూరం పెడుతోందా… ఇలా దూరం పెట్టడానికి కారణాలు తెలిస్తే ఇకపై ఆ తప్పు చేయరు!

Husband-Wife-Dispute-Problem-Solution

సాధారణంగా భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం వారి మధ్య ప్రేమను పెంచుతుంది.ఇలా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాకుండా వారి మానసిక పరిస్థితి కూడా సక్రమంగా ఉన్నప్పుడే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పడకగది విషయంలో మాత్రం భార్యలు కాస్త మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా పడకగదిలో భార్య మిమ్మల్ని దూరం పెడుతుంది అంటే అలా పెట్టడానికి పెట్టడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు.

పెళ్లి కాకముందు వరకు అమ్మాయికి తన తల్లిదండ్రులు తన తోబుట్టువులే ప్రపంచం గా మారుతారు అయితే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఎవరో ముక్కు మొహం తెలియని చోటకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు ఆమె అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అదేవిధంగా తనలో తెలియని భయం ఆందోళన కూడా ఉంటాయి. ఇలాంటి అబద్ధ భావానికి గురైనప్పుడు భార్య భర్తను తన దగ్గరకు రానివ్వదు.

ఇలా తన మానసిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా తనని దూరం పెడుతుంది అన్న భావనలో భార్యని దూషించకూడదు.ఇలా తనని ఎందుకు దూరం పెడుతున్నారు గ్రహించి ముందుగా తనలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించి తనతో మనస్పూర్తిగా మాట్లాడుతూ తనకు ధైర్యాన్ని కల్పిస్తే తనకు తానుగా మీకు దగ్గరవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

ఇక పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్న కొన్నిసార్లు భార్య భర్తను దూరం పెడుతుంది అంటే కేవలం కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శృంగారం పట్ల ప్రముఖత చూపుతోందని అర్థం అయితే ఇలా ప్రవర్తించే భార్యల పట్ల భర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక భార్య ఒకవైపు వృత్తిరీత్యా పనులు చేసుకుంటూ మరోవైపు కుటుంబ బాధ్యతలను ముందుకు నడిపిస్తుంది ఈ సమయంలోనే తాను పూర్తిగా అలసిపోయి ఉంటుంది అలాంటి సమయంలో భర్త ఎప్పుడు కూడా తనని బలవంతం చేయకూడదు వీలైతే తన పనులలో సహాయపడి తనకు దగ్గర అవడానికి ప్రయత్నించాలి. ఇక భార్య పిల్లలను ఎప్పుడు ఇంటికి పరిమితం చేయకుండా వారిని సరదాగా బయటకు తీసుకెళ్లడం వారికి సర్ప్రైజ్ గిఫ్టులు ఇవ్వడం వల్ల భార్య తన అంతట తానే మీకు దగ్గరవుతూ ఉంటుంది.