పడకగదిలో భార్య మిమ్మల్ని దూరం పెడుతోందా… ఇవే కారణాలు కావచ్చు?

సాధారణంగా భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం వారి మధ్య ప్రేమను పెంచుతుంది.ఇలా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాకుండా వారి మానసిక పరిస్థితి కూడా సక్రమంగా ఉన్నప్పుడే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇలా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉన్నప్పటికీ పడక గది విషయంలో మాత్రం భార్య భర్త నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇలా భర్తను దూరం పెట్టడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయి తాను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి ఒక్కసారిగా ఎవరో ముక్కు మొహం తెలియని చోటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్కడి వాతావరణ పరిస్థితులకు ఆమె అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది. అదేవిధంగా తనలో తెలియని భయం ఆందోళన కూడా ఉంటాయి కనుక భర్త తనని దగ్గరకు రానివ్వలేదని ఏమాత్రం గొడవ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ముందుగా భార్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని తనకు కాస్త దూరంగా ఉంటూ తనతో ప్రేమగా మాట్లాడుతూ తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఇక పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్న కొన్నిసార్లు భార్య భర్తను దూరం పెడుతుంది అంటే కేవలం కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని శృంగారం పట్ల ప్రముఖత చూపుతోందని అర్థం అయితే ఇలా ప్రవర్తించే భార్యల పట్ల భర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. భార్యకు ఇష్టమైన వాటినీ వారు అడగకముందే తీసుకురావడం వారితో సమయం దొరికినప్పుడల్లా ప్రేమగా మాట్లాడుతూ ఉండాలి. ఇలా ప్రేమగా మాట్లాడుతూ తనని క్రమంగా లైంగిక జీవితం పై ఆసక్తి కలిగేలా మార్చుకోవాలని అలా కాకుండా గొడవపడితే మాత్రం కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.