విజయసాయిరెడ్డి వర్సెస్ రామోజీరావు.! ఎవరు క్రిమినల్.?

నేరమయ రాజకీయాల్లో, నేరాల గురించి రాజకీయ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.! దురదృష్టమేంటంటే, నేర చరిత్రలో మునుగుతూ, నేరాల గురించి రాజకీయ నాయకులే మాట్లాడేస్తుంటారు. సరే, ఈ నేరాల్లో మళ్ళీ రాజకీయ నేరాలు వేరు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు రాజకీయ నాయకులు, నేరస్తులుగా మారాల్సి వస్తుంటుంది. అయినా, నేరం నిరూపితమయ్యేదాకా ఎవరూ నేరస్తుడు కాదు.! అదే సమయంలో, నేరం నిరూపితమైనోళ్ళందర్నీ కూడా నేరస్తులని అనలేం. నేరం నిరూపణ కాకపోయినంతమాత్రాన నేరస్తులు కాదని అనడమూ సరికాదు. వ్యవస్థలోని లోపాలు, నేరస్తులకు ఉపకరిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం.

అసలెందుకీ చర్చ.? ఇంకెందుకు.. గత కొంతకాలంగా మీడియా మొఘల్ రామోజీరావుకీ, వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డికీ మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది గనుక. ‘క్రికెట్‌లోనూ సాయిరెడ్డి దందా..’ అంటూ ఈనాడులో కథనం వచ్చింది. దాంతో, విజయసాయిరెడ్డికి ఒళ్ళు మండిపోయింది.

‘క్రికెట్ కూడా నీకు దందాలా కనిపిస్తోందా.? క్రీడలపై నీ రాజకీయ క్రీనీడ ఏందిరా డ్రామూ? నిందితుడైనంతమాత్రాన పదవులు చేపట్టొద్దంటే మీ చంద్రం సీఎం కూడా కాలేకపోయేవాడు. మార్గదర్శి సహా నువ్వు కూడా చాలా కేసుల్లో క్రిమినల్‌వే కదా కులగజ్జి డ్రామూ! నీ నేరాలకు ఎప్పుడో నీకు ఉరిశిక్ష పడాలి..’ అంటూ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఎవరు క్రిమినల్.? అన్న చర్చ ఇప్పుడు షురూ అయ్యింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఏడాదికిపైనే విజయసాయిరెడ్డి జైల్లో వున్నారు. అలాంటి కేసుల్లో రామోజీరావు ఏనాడైనా జైల్లో వున్నారా.? అన్నది ఇక్కడ కాస్త ఆలోచించాల్సిన విషయమే. సరే, వ్యవస్థల్ని మేనేజ్ చేసి రామోజీరావు తప్పించుకుంటున్నారనే అనుకుందాం.? వైసీపీ అధికారంలోకి వచ్చి.. మూడేళ్ళయినా రామోజీని మార్గదర్శి కేసులో ఎందుకు అరెస్టు చేయించలేదు.?