Y.S.Jagan: నేనేం మారలేదు జగన్… పదవి వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు: విజయసాయిరెడ్డి

Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారని అందుకే ఇలా మాట్లాడుతున్నారు అంటూ విజయసాయిరెడ్డి గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా విజయసాయిరెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ.. నాకు వైయస్ కుటుంబంతో గత మూడు దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. మా మధ్య రాజకీయ బంధం ఉంది తప్ప మరి ఎలాంటి బంధాలు లేవు. పెళ్లి చేసుకున్న వారే ప్రస్తుత కాలంలో విడాకులు తీసుకుని విడిపోతున్నారు మేము విడిపోవడంలో ఆశ్చర్యం లేదని తెలిపారు.

మూడు దశాబ్దాలుగా తాను వైయస్ కుటుంబంతో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని తానేమి మారలేదని తెలిపారు. నేను ఎవరి ప్రలోభాలకు లొంగలేదు, విశ్వసనీయతను కోల్పోలేదు, ఎవ్వరికీ భయపడను. నాకు భక్తి అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అప్పుడు మా నాయకుడి మీద భక్తి ఉండేది ఇప్పుడు దేవుడి మీద ఉందని తెలిపారు. నేను ఎవరి ప్రలోభాలకు లొంగను ఎన్నో బాధలు పడ్డాను అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని నాకు బాగా అర్థమైంది అందుకే బయటకు వచ్చానని తెలిపారు.

ఇక నేను మారిపోయానని మాట్లాడుతున్నారు నేనేమీ మారలేదు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను కానీ పదవి వచ్చిన తర్వాత మీరు (వైయస్ జగన్) మారిపోయారని విజయసాయిరెడ్డి తెలిపారు.అలాగే మద్యం కేసులో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అని… ఈ కేసు సిట్ చూస్తుందని… భవిష్యత్తులో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమోనని విజయసాయిరెడ్డి తెలిపారు.