AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయ్ సాయి రెడ్డి పై వీలైన ప్రతిసారి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు కురిపిస్తున్నారు. విజయ్ సాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి లొంగిపోయారని అందుకే మూడున్నర సంవత్సరం పాటు పదవి కాలం ఉన్న కూటమి ప్రభుత్వానికి మంచి చేయడం కోసమే పార్టీకి రాజీనామా చేశారు అంటూ విమర్శలు కురిపించారు.
ఈ విధంగా విజయసాయిరెడ్డి గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తాను గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నాను. అప్పుడు నేను ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేనేమీ మారలేదు.. మారింది మీరే తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోలేదు, నిజాయితీ తత్వాన్ని కోల్పోలేదు అంటూ సుదీర్ఘమైనటువంటి ప్రకటన విడుదల చేశారు.
ఇలా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా విజయసాయిరెడ్డి చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది అయితే తాజాగా ఈ ప్రకటనపై విజయ్ సాయి రెడ్డి స్పందించారు. నా పేరు మీద విడుదలైన పత్రికా ప్రకటన విషయంలో కొంతమంది మిత్రుల ద్వారా ఈ విషయం నా దృష్టికి వచ్చింది . ఆ పత్రిక ప్రకటన నేను విడుదల చేసినట్టు సర్కులేట్ అవుతుంది. అయితే అది అంతా ఆ వాస్తవమని నేను ఆ ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చారు.
నేను ఏదైనా ఒక ప్రకటన చేస్తే అది నా అధికారక X ఖాతా ద్వారానే మాత్రమే చేస్తా.. గమనించండి అంటూ మీడియాను రిక్వెస్ట్ చేశాడు విజయ సాయి రెడ్డి. దీంతో విజయసాయిరెడ్డి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఈయన ఇలాంటి పోస్ట్ చేయకుండా ఈయన పేరుతో ఎవరు ఇలాంటి పత్రిక ప్రకటన చేశారు అనేది ప్రస్తుతం సంచలనగా మారింది.