Vijay sai Reddy: రాజీనామా అనంతరం వివేక హత్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ్ సాయి రెడ్డి!

Vijay sai Reddy: వైకాపా ఎంపీ విజయ్ సాయి రెడ్డి తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే .ఇలా రాజీనామా చేయటంతో ఈయన రాజీనామాకు గల కారణం ఏంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు ధన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ వీడియో సమావేశంలో భాగంగా వైఎస్ వివేక హత్య కేసు నుంచి బయటపడటం కోసం అలాగే తనపై నమోదు అయిన అవినీతి కేసుల నుంచి బయటపడటం కోసమే రాజీనామా చేశారా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి.

ఈ ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెబుతూ తాను కేసులకు భయపడి రాజీనామా చేయలేదని తెలిపారు తనపై ఎన్నో అక్రమ కేసులను పెట్టారు. అయితే తాను కేసులకు భయపడనని తెలిపారు.. నా వ్యక్తిగత కారణాలవల్లే రాజకీయాలకు రాజీనామా చేశానని తెలిపారు. ఇక వైయస్ వివేక హత్య కేసు గురించి కూడా ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడని ఆయనని కాపాడటం కోసం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారని వాదనలు కూడా బయటకు వచ్చాయి. అయితే తాజాగా వివేకానంద రెడ్డి హత్య గురించి విజయసాయిరెడ్డి స్పందించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యకి గురి అయ్యారు అనే విషయం తెలుసు తాను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.

ఇలా ఈ విషయం తెలిసిన వెంటనే తాను వైయస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. నేను ఫోన్ చేయడంతో వైయస్ అవినాష్ షెడ్యూల్ వేరే వారికి ఫోన్ ఇచ్చారు అయితే అవతల వ్యక్తి నాతో మాట్లాడుతూ గుండెపోటుతోనే వైయస్ వివేకానంద రెడ్డి మరణించారు అంటూ చెప్పారు. వాళ్ళు ఏదైతే చెప్పారో నేను అదే మీడియా ముందు చెప్పాను అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇలా రాజీనామా చేసిన అనంతరం ఈయన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడటంతో ఇది కాస్త సంచలనంగా మారింది అయితే తాను కేసులకు భయపడి మాత్రం రాజీనామా చేయలేదని నేను రాజీనామా చేస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి వివరించానని ఆయనకు చెప్పిన తరువాతనే రాజీనామా చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు.