విజయసాయిరెడ్డి మైండ్ గేమ్.. వైసీపీకి తీవ్ర నష్టం కలిగిస్తుందా.. ? 

Vijayasaireddy pin hopes on Modi

 

రాజకీయాల్లో ఎందరో నాయకులు ఉన్నప్పటికి అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు.. అలాంటి వారిలో విజ‌య‌సాయిరెడ్డి ఒకరు.. ముఖ్యంగా వైసీపీలో ఎంతో మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నా ఆ పార్టీకి సెంటర్ అఫ్ ది టాపిక్ ఆయనే.. ఎందుకంటే రాష్ట్ర రాజ‌కీయాల్లోను, జాతీయ రాజ‌కీయాల్లోనూ వైసీపీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తున్న వారిలో విజ‌య‌సాయిరెడ్డి మాత్రం వెరీవెరీ స్పెషల్ అనే ప్రచారం ఉంది.. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయ‌కుల‌కు ఎప్పటికప్పుడు కౌంట‌ర్లు ఇవ్వడంలోను, విమ‌ర్శలు చేయ‌డంలోను విజయ సాయిరెడ్డి ముందుంటున్నారు. మరోవైపు సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ వాళ్లపై మాటల తూటాలతో దాడిచేస్తారు.. కానీ ఇటీవల కాలంలో విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పుపట్టే విధంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

మొన్నటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణపై మైండ్ గేమ్ ఆడి, అందులో చాలా వరకూ సక్సెస్ అయ్యారు విజయసాయిరెడ్డి. ఇక తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన పురందేశ్వరిని కూడా విజయసాయిరెడ్డి టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. ఎందుకంటే తాజాగా పురందేశ్వరి పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను, రాజకీయ విశ్లేషకులు, మేధావులు సైతం తప్పుపడుతున్నారు..

ఇదిలా ఉండగా అమరావతి రాజధానిగా కొనసాగాలని పురందేశ్వరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజానికి ఇది బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయం కూడా. కానీ పురందేశ్వరి తమ జాతి ప్రయోజనాల కోసం ఇలా అన్నారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అదీగాక పురందేశ్వరి మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని అంటున్నారట. ఇకపోతే ప్రతిసారీ కమ్మ సామాజికవర్గంపై విజయసాయిరెడ్డి చేస్తున్న కామెంట్స్ ప్లస్ అయ్యాయేమో కాని, పురందేశ్వరి మాటలను సామాజికవర్గంతో ముడిపెట్టడం తగదని గుర్తుంచుకుంటే మంచిదని విజయసాయిరెడ్డికి చురకలు వేస్తున్నారు కొందరు నాయకులు..