YS Sharmila: వైకాపా కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. తాను తన వ్యక్తిగత కారణాలవలే ఈ నిర్ణయం తీసుకున్నారని అయితే రాజీనామా తర్వాత తిరిగి ఏ పార్టీలోకి వెళ్ళనని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానంటూ ఈయన తన రాజీనామాలు ప్రకటించడమే కాకుండా రాజ్యసభ చైర్మన్ ని కలిసి ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అందజేయడంతో చైర్మన్ ఆమోదం తెలిపారు .
ఇక వైకాపా పార్టీ పదవులకు అలాగే సభ్యత్వానికి కూడా ఈయన రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖను వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా పంపించారు . ఈ విధంగా సాయి రెడ్డి రాజీనామా చేయడం వైకాపా నాయకులు జీర్ణించుకోలేకపోయారని చెప్పాలి. జగన్ వద్ద నమ్మకం కోల్పోవడంతోనే కీలక నేతలందరూ కూడా పార్టీ నుంచి బయటకు వస్తున్నారంటూ షర్మిల తెలియజేశారు. ఇక విజయసాయి రెడ్డి బయటకు రావడం వెనుక కూడా పెద్ద ప్లాన్ ఉందని తెలిపారు.
ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సాయిరెడ్డి గత మూడు రోజుల క్రితం ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలను కలిసినట్టు తెలుస్తుంది .ఇలా వైఎస్ షర్మిలను కలవడంతో వైకాపా నాయకులలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. హైదరాబాదులోని లోటస్ పాండులో దాదాపు 3 గంటల పాటు వైఎస్ షర్మిల సాయిరెడ్డి బేటి అయినట్టు తెలుస్తుంది.
వైయస్ షర్మిల ఇంటిలోనే విజయసాయిరెడ్డి భోజనం చేయడమే కాకుండా ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించినట్టు తెలుస్తుంది. అయితే గతంలో జగన్ పక్షాన మాట్లాడుతూ వైయస్ షర్మిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించిన నేపథ్యంలో జగన్ సూచనల ప్రకారమే తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అందుకు క్షమించాలని విజయ్ సాయి రెడ్డి షర్మిలను కోరినట్టు తెలుస్తుంది. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే విజయసాయిరెడ్డి షర్మిలను కలవడంతో ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ కొంతమంది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఎంత సన్నిహితమున్న నేపథ్యంలోని షర్మిలను కలిశారంటూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.