ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కానీ, ప్రతిపక్షాలు దానిని వ్యతిరేకిస్తూ అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తున్నారు. దానికి తగ్గట్లు పచ్చ మీడియా కూడా ఇష్టం వచ్చిన రీతిలో రాతలు రాస్తుంది. ఇక తాజాగా విశాఖలో జరిగిన గీతం యూనివర్సిటీ యొక్క అక్రమ కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసిన ఘటనపై ప్రతిపక్షాలు, దాని అనుకూల మీడియా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.
దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఘాటైన సమాధానం ఇచ్చాడు. అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తి నోరు కొట్టుకుంటుంది అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆంధ్రా యూనివర్సిటీ ను దయ్యాల కొంప అని, సదరు ఆక్రమ దారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకొనే ఏయూను భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు అని విమర్శించారు. పేదల ప్రయోజనాల కన్నా పచ్చ నాయకుని ప్రయోజనాలే ఎక్కువై పోయాయా అంటూ సూటిగా ప్రశ్నించారు .
గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మూర్తి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ లో సరైన వసతులు లేవు, అది ఒక దెయ్యాల కొంప లాగా మారిపోయిందంటూ వ్యాఖ్యలు చేశాడు .. అప్పట్లోనే దీనిపై తీవ్ర విమర్శలు రావటం జరిగింది. తాజాగా వాటిని మరోసారి విజయసాయి రెడ్డి గుర్తు చేస్తూ , గీతం యూనివర్సిటీ కి మద్దతు గా మాట్లాడే వాళ్ళ నోటికి తాళం వేశాడు.
అయితే విజయసాయి రెడ్డి చేసిన ట్విట్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా గా కూడా పోస్ట్ లు వస్తున్నాయి. విద్యాలయం కోసమే భూమి వాడుకున్నారు తప్పితే, వ్యక్తిగత అవసరాల కోసం, ఇతర హంగుల కోసం వాడుకోలేదు, ఇడుపులపాయలో మీరు నిర్మించిన వైఎస్సార్ స్మృతి వనం విషయంలో ఇతరుల భూములను ఆక్రమించి మీరు కట్టించినట్లు అనేక విమర్శలు వచ్చాయి. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. మీకు ఒక రూల్, ఇంకొకరికి మరొక రూల్ ఏంటి అంటూ కొందరు నెటిజన్లు విజయసాయి రెడ్డికి ప్రశ్నిస్తున్నారు