బీజేపీపై వలపు బాణాలు సంధిస్తునన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.!

Vijaya Sai Reddy :రాజకీయాల్లో ఈ మధ్య వలపు బాణాలు ఎక్కువైపోయాయ్.! వన్ సైడ్ లవ్.. అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత మీదకు వలపు బాణాలు విసురుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అందరికన్నా ఘాటుగా సెటైర్లేస్తున్నారు వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.

చిత్రమేంటంటే ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు బీజేపీ మీదకు వలపు బాణాల్ని సంధిస్తున్నారు. టీడీపీ అనుకూల మీడియా సాయంతో, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నది విజయసాయిరెడ్డి వేసిన తాజా ట్వీటు సారాంశం.

బీజేపీ ఏమీ వైసీపీకి మిత్రపక్షం కాదు. అలాంటప్పుడు, బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే, వైసీపీకెందుకంత ఒళ్ళు మంట.! నిజానికి, చంద్రబాబు విషయమై బీజేపీ ఏనాడూ ఈ విషయమై ఇంతలా సెటైర్లు వేయలేదాయె.

పేరుకే వైసీపీ ఎంపీ.. ఇప్పుడాయన బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటున్నారంటే.. ఆయనగానీ బులుగుతోపాటు కషాయ రాజకీయాన్ని వంట పట్టించుకోనున్నారేమో.. అనే సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. పది మంది మీద సెటర్లు వేస్తే.. పవర్ ఫుల్ అని తమకు తాము ఫీలయిపోవడం రాజకీయ నాయకులకి అలవాటే. మరి, ఆ పది సెటైర్లకు వెయ్యి కౌంటర్ ఎటాక్స్ వస్తే పరిస్థితేంటి.?

ఇంతకీ, ప్రధాని నరేంద్ర మోడీ మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అంత మమకారమెలా వచ్చిందబ్బా.? ఇది వైసీపీ విధానమైతే కాదు కదా.?