Vijay Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించిన వారిలో విజయసాయిరెడ్డి ఒకరు. జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్నటువంటి ఈయన పార్టీ వ్యవహారాలన్నింటిని చక్కబెడుతూ ఉండేవారు. రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి ఎవరు ఊహించని విధంగా తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తాను బయటకు వస్తున్నట్లు పార్టీకి రాజీనామా చేశారు.
ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన విజయ్ సాయి రెడ్డి ఇతర పార్టీలలో ఏదైనా చేరుతారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు కానీ ఈయన మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ మిగిలిన జీవితాన్ని వ్యవసాయం చేసుకుంటూ గడుపుతానని తెలిపారు. ఈయన అధికారకంగా రాజకీయాలకు రాజీనామా చేసినప్పటికీ సైలెంట్ గానే అన్ని రాజకీయ వ్యవహారాలను చక్కబెడుతున్నారని తెలుస్తుంది.
ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయ్ సాయి రెడ్డి బీజేపీకి టచ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్ కి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ రావటంతో ఆయనకు ఎంతోమంది నేతలు ఘనస్వాగతం పలికారు అలాంటి వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉండటం విశేషం. అయితే విజయ్ సాయి రెడ్డి పదవిలో ఉన్నప్పుడు జగదీప్ తనకు మంచి స్నేహితుడిగా మారారని ఆ స్నేహం కారణంగానే వచ్చి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.
ఇక ఇలా ఉపరాష్ట్రపతిని కలవడానికి వచ్చిన విజయసాయి రెడ్డికి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పారట. ఇంతకీ ఎందుకు ? అనే ప్రశ్న అందరి మదిని తొలుస్తోంది.వ్యవసాయం చేసుకోవాలని విజయసాయి నిర్ణయించుకున్నందుకు తనకు ఎందుకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే మరి కొందరు మాత్రం ఆయన త్వరలోనే కీలక పదవి అందుకోబోతున్నారని అందుకే తనకు ముందుగానే శుభాకాంక్షలు చెబుతున్నారని భావిస్తున్నారు.
విజయసాయిరెడ్డిని తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్లమెంటులో హుందాగా వ్యవహరించడంలో,కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా మెలగడంలో విజయసాయి రెడ్డికి తమిళనాడు గవర్నర్గా పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మరికొన్ని నెలలు వేచి ఉండాలి.