ఆ హీరోయిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన విజయ్ దేవరకొండ … ఏంటి ఆ పిల్లలో అంత టాలెంట్ ఉందా!

vijay showered his fighter movie co star ananya pandey with comoliments

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి యూత్ లో వున్న క్రేజ్ గురించి ప్రతేకంగా చెప్పవలసిన అవసరం లేదు.ప్రస్తుతం ఈ హీరో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాన్ ఇండియా మూవీ ఒకటి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రంలో ముంబై భామ అనన్య పాండే కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య గురించి మాట్లాడుతూ.. తను చాలా డౌన్ టు ఎర్త్ అని.. అలాగే అనన్య సూపర్ టాలెంట్ అమ్మాయి అని.. రాబోయే రోజుల్లో అనన్య సూపర్ స్టార్ అవుతుంది అని తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు.

vijay showered his fighter movie co star ananya pandey with comoliments
working still from ‘Fighter’ movie

అనన్య కూడా గతంలో హీరో విజయ్ దేవరకొండపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. అనన్య మాట్లాడుతూ.. ‘విజయ్ చాల స్మార్ట్ అండ్ కైండ్… అందరితో బాగా మాట్లాడతాడు, ముఖ్యంగా తనకు సంభాషణను ఎలా కొనసాగించాలో బాగా తెలుసు, తనతో కలిసి వర్క్ చేయడం చాల హ్యాపీగా ఉందని’ తెలిపింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మిస్తున్నాడు.. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.ఈ సినిమాకు ‘ఫైటర్ ‘ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.