Vijay Sai Reddy: అవును నేను వాళ్లను కలిసాను… మీకెందుకు భయం… కౌంటర్ ఇచ్చిన విజయ్ సాయి రెడ్డి!

Vijay Sai Reddy: వైసీపీలో కీలక నేతగా ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం మనకు తెలిసినదే. ఇలా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిందే కాకుండా తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ఏ ఇతర పార్టీలలోకి వెళ్ళనని ఇక తన జీవితంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతానని ఈయన పోస్ట్ చేశారు. ఇలా పోస్ట్ మాత్రమే చేశారు కానీ ఈయన పరోక్షంగా రాజకీయాలలో కొనసాగుతూనే ఉన్నారు.

విజయ్ సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటన వచ్చినప్పటి నుంచి తరచూ పలువురు బిజెపి నాయకులను తెలుగుదేశం పార్టీ నాయకులను ఈయన కలుస్తూ ఉన్నారు. ఇటీవల విజయసాయిరెడ్డి టీడీ జనార్ధన్ తో భేటీ అయినట్టు ఒక వీడియోని వైసీపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగుదేశం పార్టీకి చెందిన వారితో విజయసాయిరెడ్డి రహస్యమంతనాలు జరపడం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటి అంటూ వైసీపీ ఈ వీడియోని విడుదల చేయడంతో ఇది కాస్త సంచలనగా మారింది.

తాజాగా విజయసాయిరెడ్డి ఈ ఘటన గురించి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను గత మూడు దశాబ్దాలలో వైఎస్ కుటుంబం కోసం పని చేస్తున్నాను కానీ ఇప్పుడు జగన్ గారు తన కోటరీ మాటలను నమ్మి నన్ను దూరం పెట్టారు. నాకు సంబంధం లేని విషయాలను నేను తగిలించుకోవాలని వారు భావిస్తున్నారు. 2011 వ సంవత్సరంలో 21 కేసులు పైన వేసుకున్న నేను 2025 లో కూడా జగన్ గారే అడిగి ఉంటే నాకు సంబంధం లేకపోయినా బాధ్యతలను తీసుకునే వాడిని.కోటరీ వారే నాకు వెన్నుపోటు పొడిచారు.

ఎవరో కోటరీ చేసిన నేరాలను సాయిరెడ్డి నెత్తిన వేసుకుంటే మంచోడు లేదంటే చెడ్డవాడు అవుతాడా? వెన్నుపోటుదారుడు అవుతారా? అంటూ ప్రశ్నించారు. అవును నేను ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లాను వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆయన మా కూతురు పెళ్లికి కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు నేను అక్కడికి వెళ్లిన తరువాత టీజీ జనార్దన్ కూడా వచ్చారు అతను వస్తున్న విషయం కూడా నాకు తెలియదు.

జగన్ హయామంలో లిక్కర్ స్కామ్ జరగలేదని, వైసిపి కోటరీ చెబుతుంది అలాంటప్పుడు నేను వారితో ఏం చర్చిస్తాను అనే విషయాన్ని కూడా గమనించాలి కదా.. నేను చంద్రబాబు నాయుడును లోకేష్ ని కలవాలి అనుకుంటే బహిరంగంగా కలుస్తా ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాలలో లేను, ఎవరినైనా బహిరంగంగా కలిసే హక్కు నాకుంది అంటూ విజయ్ సాయి రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.