VSR: మాకు క్యారెక్టర్ ఉంది…. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన విజయ్ సాయి రెడ్డి?

VSR: వైకాపా నుంచి ఇటీవల రాజీనామా చేసిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉన్న విషయం మనకు తెలిసినదే. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలక నాయకుడు పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకోవడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈయన అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది విజయసాయిరెడ్డి అని చెప్పాలి ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.

తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇకపై తాను ఏ పార్టీలోకి వెళ్ళనని వ్యవసాయం చేసుకుంటూ మిగిలిన జీవితం గడుపుతానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అయితే ఈయన జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్న సమయంలో రాజీనామా చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్రకి వచ్చారు. ప్రస్తుతం ఈయన పార్టీ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా మీడియా సమావేశంలో భాగంగా విజయ్ సాయి రెడ్డి రాజీనామా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో కొనసాగాలి అంటే క్యారెక్టర్ ఎంతో ముఖ్యమని తెలిపారు. అది ఇప్పటివరకు వెళ్లిన ఎంపీలకైనా వెళ్లబోయే వారికైనా వర్తిస్తుంది అంటూ జగన్ మాట్లాడారు.

ఇలా పరోక్షంగా విజయ సాయి రెడ్డికి క్యారెక్టర్ లేదని జగన్ చెప్పకనే చెప్పేశారు ఇలా తన రాజీనామా పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ సాయి రెడ్డి ట్వీట్ చేస్తూ… వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టి ధైర్యంగా రాజ్యసభ పదవులను పార్టీ పదవులను అలాగే రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నానని విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.