Nagavamshi: మాకు విజయ్ దేవరకొండనే పవన్ కళ్యాణ్… వివాదానికి తెరలేపిన నాగవంశీ!

Nagavamshi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్ కు వీర విధేయుడు అనే సంగతి మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏకంగా తన సినిమాని కూడా విడుదల వాయిదా చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కి ఉన్న ఇమేజ్ గురించి తెలిసినప్పటికీ పవన్ పట్ల చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.

తాజాగా నాగ వంశీ నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ చేసుకోవడంతో చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నాగ వంశీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారాయి. ఈ సందర్భంగా నాగ వంశీ ఈ సినిమా థాంక్స్ మీట్ ఈవెంట్లో మాట్లాడుతున్న నేపథ్యంలో.. విలేకరుల నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటూ ప్రశ్న కావడంతో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది అందుకే సక్సెస్ ఈవెంట్ ఉత్తరాంధ్రలో నిర్వహిస్తామని తెలిపారు అయితే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తారా అంటూ మరో ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నాగవంశీ స్పందిస్తూ.. ‘లేదండి పవన్ కల్యాణ్‌ ను పిలవట్లేదు. ఇప్పుడు ఈయనే(విజయ్ దేవరకొండ) మాకు పవన్ కల్యాణ్‌ అన్నాడు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కవుతూనే వావ్ అనేశారు. కానీ ఇండస్ట్రీలో ఒక్కడే పవన్ కల్యాణ్‌ ఉంటాడని.. అది ఏపీ డిప్యూటీ సీఎం మాత్రమే అని పవన్ ఫ్యాన్స్ నాగ వంశి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రాజకీయాలలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను విజయ్ దేవరకొండతో పోల్చడం ఏంటి అంటూ మరికొందరు ఈయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.