Vijay Devarakonda: విజయ్ దేవరకొండ చివరిగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయిన పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తిరిగి ఎలాంటి సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే త్వరలోనే కింగ్ డమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల టీజర్ లాంచ్ చేశారు ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసిన సమయంలోనే ఎన్టీఆర్ అన్న చెబితే బాగుంటుంది అని అనుకున్నాము.
అనంతరం ఎన్టీఆర్ అన్నని కలిసి ఇదే విషయం చెప్పాము.కాసేపు ముచ్చటించిన తర్వాత ఈ సాయంత్రం చేసేద్దాం అన్నారు. దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్ కు సంబంధించిన మ్యూజిక్ వర్క్ లో బిజీగా ఉన్నారని చెప్పాము. ఏం పర్వాలేదు నువ్వు ఉన్నావు కదా అంటూ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారని అందులో డైలాగ్స్ ఆయనకు అంతగా నచ్చాయని తెలిపారు. ఎన్టీఆర్ అన్న నా సినిమాకు ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం నిజంగా నా అదృష్టం అంటూ విజయ్ దేవరకొండ వెల్లడించారు. హిందీలో రణబీర్ కపూర్, తమిళంలో సూర్య టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారని తెలిపారు.