Vijaya Devarakonda: విజయ్ దేవరకొండ మా ఇంట్లో వంటలు చేసేవాడు…కానీ ఈ రోజు: ఫిదా ఫేమ్ గీత భాస్కర్!

Vijaya Devarakonda: పెళ్లి చూపులు సినిమాకు సంబంధించి 4 రోజులు షూటింగ్ అంతా తమ ఇంట్లోనే జరిగిందని ఫిదా మూవీ ఫేమ్ గీత భాస్కర్ అన్నారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడం, వంటింట్లో విజయ్ దేవరకొండ వండడం ఆ సీన్లన్నీ ఇంట్లోనే షూట్ చేశారని ఆమె తెలిపారు. తన భర్త వాస్తు ఎక్స్‌పరమెంట్స్‌తో ఇప్పటివరకూ తాము చాలా ఇళ్లులు మారామని ఆమె చెప్పారు. తాను అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే తరుణ్ భాస్కర్ 3 ఇళ్లల్లో డైరెక్టర్ అయ్యారని, ప్రతీ ఇంట్లోనూ ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ అయ్యేదని ఆమె చెప్పుకొచ్చారు.

రెంటెడ్ ఇంట్లో మనకు అన్నీ అనుకూలంగా దొరకదు కదా అని అలా ఇళ్లులు మారుస్తూ వచ్చామని ఆమె స్పష్టం చేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ చాలా క్లోజ్‌గా ఉంటారని గీత అన్నారు. వాళ్లంతా కూడా ఒక ఫ్యామిలీలానే ఉంటామని ఆమె చెప్పారు.

ఇకపోతే వాళ్లిద్దరూ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారని, ఒకేసారి హిట్ కూడా కొట్టారని ఆమె తెలిపారు. అంతేకాకుండా తరుణ్ భాస్కర్‌ని హీరోగా పెట్టి ప్రొడ్యూస్‌ కూడా చేశారని గీత చెప్పారు. అందులోనే వాళ్ల ఫ్రెండ్షిప్‌ ఏంటో తెలిసిపోతుంది అని ఆమె అన్నారు. వాళ్ల మధ్య సంభాషణ కూడా రారా, పోరా అనే మాట్లాడుకుంటారు అని ఆమె చెప్పారు. తరుణ్‌ని సర్ అని పిలవడం చాలా తక్కువ అని, అతను కూడా అలా ఎక్సెప్ట్ ఏమీ చేయడని, అందరితోనూ ఒక ఫ్రెండ్‌లా ఉండడానికే ఇష్టపడతాడని ఆమె తెలిపారు.