విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అవ్వడానికి కారణం ఆయన వ్యవహారశైలి. అతనిలోని సూపర్ కాన్ఫిడెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఏదైనా చేయగలను అనే అతని ధోరణి కొత్తగా అనిపించింది. అందుకే తక్కువ టైంలోనే చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు.
తాజాగా కూడ విజయ్ పెద్ద ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ అంత ఈజీ ఛాలెంజ్ ఏమీ కాదు. వసూళ్లకు సంబంధించిన ఛాలెంజ్. ఇప్పటివరకు విజయ్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ పడలేదు ఆయనకు. ఇప్పుడు చేస్తున్న ‘లైగర్’ సినిమాతో 200 కోట్లకు పైగానే కొల్లగొడతాను అంటున్నాడు విజయ్.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘లైగర్’ చిత్రానికి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఓటీటీ డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఇస్తే 200 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. దానికి ‘లైగర్’ టీమ్ నో చెప్పింది. విజయ్ అయితే 200 కోట్లు అనేది చాలా తక్కువ అని థియేటర్లలో అంతకంటే ఎక్కువే వసూలు చేస్తానని ధీమాగా చెప్పుకొచ్చాడు.
మరి విజయ్ చెప్పినట్టే 200 కోట్లకు మించి వసూలు చేస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందిస్తున్నారు. రెండింటిలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.