Liger : “లైగర్” తో ఏకంగా ఇండియన్ రికార్డునే సెట్ చేసిన విజయ్ దేవరకొండ.!

Liger : రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వబోతున్న లేటెస్ట్ సినిమా “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక మాస్ యాటిట్యూడిక్ హీరోకి అంతే మసాలా యాడ్ చేసే మాస్ దర్శకుడు దొరికితే ఆ మ్యాడ్నెస్ ఎలా ఉంటుందో పూరి జగన్నాథ్ చూపిస్తున్నాడు.

ఈ కాంబో అనౌన్స్ అయ్యినప్పుడే అనేక అంచనాలు నెలకొనగా ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ అప్డేట్ ని మేకర్స్ నిన్న రివీల్ చేశారు. ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ గ్లింప్స్ ని పాన్ ఇండియన్ లెవెల్లో సింగిల్ వీడియోగా రిలీజ్ చెయ్యగా దానికి రికార్డు స్థాయి రెస్పాన్స్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

పైగా ఈ గ్లింప్స్ ఆల్ టైం ఇండియా రికార్డు సెట్ చెయ్యడం విశేషం. మొత్తం 24 గంటలకి గాను ఈ వీడియో 15.92 మిలియన్ వ్యూస్ అందుకొని భీమ్లా నాయక్ వ్యూస్ రికార్డుని బద్దలు కొట్టగా దగ్గరగా 4 లక్షల లైక్స్ తో ఈ వీడియో ఆల్ టైం టాప్ 5 స్థానంలో నిలిచింది.

దీనితో మళ్ళీ ఇండియన్ సినిమా లైగర్ కోసం మాట్లాడుకుంటుంది. మరి ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.