విజయ్ దేవరకొండ లీగర్ ఓటిటి లో వచ్చేసింది

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలయిన ‘లైగర్’ సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా రిలీజ్ ముందు విజయ్, పూరి సినిమా భారీ హిట్ అవుతుందని, అలాగే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ ఐపోతాడు అని చాలా హోప్స్ పెట్టుకున్నారు.

అలాగే ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో కొంచెం ఎక్కువ చేసి, తమ సినిమా కంటే ఇంకో గొప్ప సినిమా లేదని కొంచెం అతి చేసారు. తీరా రిలీజ్ అయ్యాక ఆ సినిమా అడ్రస్ లేకుండా పోయింది. ఈ మూవీలో రమ్యకృష్ణ, విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో కనిపించగా రోనిత్ రాయ్, ఆలీ, విషు రెడ్డి, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఇతర పాత్రలు చేసారు.

థియేటర్ లో ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు  ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.  ఈ రోజు నుండి  నుండి ప్రముఖ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటిటిలో అందుబాటులోకి రాగా, త్వరలో హిందీ వర్షన్ కూడా రిలీజ్ కానుంది.