అనుష్క, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తే…

Vijay-Devarakonda-doing-key
Vijay-Devarakonda-doing-key
 
స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాల స్పీడ్ బాగా తగ్గించారు. ‘భాగమతి’ తరవాత చాన్నాళ్లకి ‘నిశ్శబ్దం’ చేసిన ఆమె ఇంకా కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. యువీ క్రియేషన్స్ సంస్థతో ఆమె ఒక సినిమాకి సైన్ చేశారు.  ఇందులో నవీన్ పోలిశెట్టి కథానాయకుడు. త్వరలోనే సినిమా మొదలుకానుంది. ఏజ్ గ్యాప్ ఉన్న జంట మధ్యన నడిచే ప్రేమ కథే ఈ చిత్రం. అనుష్క, నవీన్ పోలిశెట్టి ఇద్దరికీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.  అందుకే ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చిత్రానికి మరింత హైప్ తీసుకొచ్చేలా కొత్త ప్లాన్ చేస్తున్నారు టీమ్. 
 
అదే విజయ్ దేవరకొండ.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చేత ఒక కీలక పాత్ర చేయించే ప్రయత్నాల్లో ఉన్నారట.  విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  అతని సినిమా అంటే అతనే సగం పబ్లిసిటీ. స్టార్ హీరోల స్థాయిలో ఫేమ్ సంపాదించుకున్నాడు. అలాంటి విజయ్ దేవరకొండ అనుష్కతో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద అంచనాలు మరింత పెరగడం ఖాయం.  ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యేలోపు అనుష్క, నవీన్ పొలిశెట్టి సినిమాను స్టార్ట్ చేస్తారు.  ఆ తర్వాత విజయ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది.