సినిమా పరిశ్రమకే చెందిన నటీనటులు అలాగే పలువురు టెక్నీషియన్స్ పెళ్లిళ్లు చేసుకోవడం అనేది కాస్త అరుదు గానే కనిపిస్తుంది అని చెప్పాలి. అలాగే ఈ పెళ్లిళ్లు కూడా తర్వాత ఏమయ్యాయో కూడా చూసాము. అయితే తాజాగా మాత్రం సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఓ జంట పెళ్లి మంచి హాట్ టాపిక్ గా నిలిచింది.
మరి ఆ జంట ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు దర్శకుడ్ విగ్నేష్ శివన్ లే.. అయితే వీరిద్దరూ గత ఐదేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఫైనల్ గా ఈ జంట ఈరోజు ఒకటి కాబోతుండడంతో విగ్నేష్ శివన్ ఒక ఎమోషనల్ మెసేజ్ ని నయనతారతో పెళ్లి విషయంలో పెట్టడం వైరల్ గా మారింది.
ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు, మంచి చేదు, నా సినిమా షూటింగ్స్, దానికి ముందు నా ప్రార్ధనలు, ప్రతి చిన్న అంశాన్ని ఇపుడు నేను నా నయనతారకి డేడికేట్ చెయ్యాలి అనుకుంటున్నాను అందుకు ఆ భగవంతునికి ఈ ప్రపంచానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఒక ఎమోషనల్ మెసేజ్ ని ఈరోజు నయన్ ని పెళ్లి చేసుకుంటున్న సందర్భంగా తెలియజేసాడు. దీనితో ఈ లవ్ పోస్ట్ మంచి వైరల్ గా మారింది.