పెళ్లి కానుక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన విగ్నేష్.. రిటర్న్ గిఫ్ట్ గా నయన్ ఇచ్చిన గిఫ్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో విహరిస్తూ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి నయనతార విగ్నేష్ శివన్ ఈనెల 9వ తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే వీరి పెళ్ళికి మహాబలిపురంలో వేదిక ఎంతో ఘనంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా ఎంతో ఘనంగా పూర్తి అయినట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాల ప్రకారం పెళ్లి కానుకగా దర్శకుడు విగ్నేష్ తన ప్రేయసి నయనతారకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పెళ్లి సమయంలో నయనతార ధరించే నగలను అన్నింటినీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేసి విగ్నేష్ తనకు బహుమతిగా ఇచ్చారని సమాచారం. ఇకపోతే ఈ నగలను సుమారు 5 కోట్ల వరకు ఖరీదు చేస్తాయని బంగారు నగలతో పాటు తనకు డైమండ్ రింగ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఈ విధంగా తన ప్రియుడు నుంచి గిఫ్ట్ తీసుకున్న నయనతార తన ప్రియుడికి తన నుంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. అయితే నయనతార చాలా ఖరీదైన గిఫ్ట్ విగ్నేష్ కి ఇచ్చినట్టు తెలుస్తోంది.

నయనతార తన అభిరుచులకు అనుగుణంగా ఎంతో అందమైన ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంటిని తన ప్రియుడు విగ్నేష్ పేరు పై రాసి పెళ్లికి కానుకగా తనకు కాబోయే భర్త కు గిఫ్ట్ ఇచ్చారని సమాచారం. అయితే ఈ ఇల్లు సుమారు 20 కోట్ల ఖరీదు చేస్తుందని తెలుస్తోంది. ఈ విధంగా తన ప్రియుడికి నయనతార కోట్లలో ఖరీదైన బంగ్లాను గిఫ్ట్ గా ఇచ్చారని తెలియడంతో ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక వివాహం జరిగిన తర్వాత ఈ జంట ఇదే ఫ్లాట్లోనే నివసిస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ జంట ఒకరికొకరు ఇలా కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.