Nayanathara: టాలీవుడ్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో చాలా సినిమాలలో హీరోయిన్గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నయనతార నిర్మాతగా మారి సినిమాలను నిర్మించడంతోపాటు కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సినిమాకు మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.కాగా కోలీవుడ్ భామ నయనతార ఈ మధ్య కాలంలో తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉంది. గతంలో కూడా చాలాసార్లు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి ఇబ్బందుల్లో పడింది.
గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన డాక్యామెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేయిల్ లో అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్స్ వాడారన నిర్మాణ సంస్థ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. క్లిప్ లను తొలగించాలని డిమాండ్ చేస్తూ రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని లీగల్ నోటీసు అందజేసినప్పటికీ అదే కంటెంట్ తో డాక్యుమెంటరీ ప్రసారం అవుతోందని ఎబి ఇంటర్నేషనల్ వాదించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టార్క్ స్టూడియోస్ ను ఆదేశించింది. ఇందుకోసం అక్టోబర్ 6 వరకు గడువు ఇచ్చింది. టార్క్ స్టూడియోస్ నిర్మించిన నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 2024లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా గతంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైన ధనుశ్‌కు చెందిన వుండర్‌బార్ ఫిల్మ్స్ తమ సినిమా నానుమ్ రౌడీ దాన్ నుంచి సన్నివేశాలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ కోటి రూపాయల నష్టపరిహారం కోరింది. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ డాక్యుమెంటరీపై మరో వివాదం మొదలైంది.
Nayanathara: మరో వివాదంలో చిక్కుకున్న నయనతార.. ఏది చేసినా కాంట్రవర్సీనే!
