ఎన్టీఆర్ నుంచి ఆ విషయాలు నేర్చుకున్నా.. విలన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ రోల్స్ పోషించడం ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో విద్యుత్ జమ్వాల్ ఒకరు. శక్తి, ఊసరవెల్లి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో విద్యుత్ జమ్వాల్ విలన్ గా నటించారు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా టాలెంట్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న నటులలో విద్యుత్ జమ్వాల్ ఒకరు కావడం గమనార్హం. కమాండో సిరీస్ ద్వారా విద్యుత్ జమ్వాల్ పాపులారిటీని పెంచుకున్నారు.

విజయ్ హీరోగా మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన తుపాకి నటుడిగా విద్యుత్ జమ్వాల్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. పలు సినిమాల్లో విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించాయి. విద్యుత్ జమ్వాల్ నటించిన ఖుదా హాఫిజ్: చాప్టర్ 2 అగ్ని పరీక్ష వచ్చే నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. విద్యుత్ జమ్వాల్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.

హైదరాబాద్ నుంచి తన సినీ కెరీర్ మొదలైందని ముంబైలో గర్వంగా చెబుతానని ఆయన తెలిపారు. తను నటించిన తొలి సినిమా శక్తి అని ఆ సినిమా షూట్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను ఏమని పిలవాలో తనకు అర్థమయ్యేది కాదని విద్యుత్ జమ్వాల్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తనను తారక్ అని పిలవమని చెప్పారని విద్యుత్ జమ్వాల్ వెల్లడించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్వారా దయ, ప్రేమతో ఉండాలని నేర్చుకున్నానని విద్యుత్ జమ్వాల్ పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన విషయాలను ఎక్కడికి వెళ్లినా మరిచిపోనని ఆయన అన్నారు. హనుమంతుడు నాకు ఇష్టమైన స్టార్ హీరో అని ఆయన తెలిపారు. జీ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ ఖుదా హాఫిజ్: చాప్టర్ 2 అగ్ని పరీక్ష ను నిర్మించాయి. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.