AP: చంద్రబాబుకు నిరసనశగా… బయటకు వెళ్తే ప్రశ్నిస్తున్న ప్రజలు… ఇలా అయితే కష్టమే మరీ?

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా వారు కాస్త ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డారని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి విజయానికి సంక్షేమ పథకాలే కారణమని గ్రహించిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అధికంగా సంక్షేమ పథకాలను అందిస్తాము అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో హామీ ఇచ్చారు.

ఇలా చంద్రబాబు నాయుడు అలివి గాని హామీలను ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు పదేపదే తమ హామీల గురించి ప్రస్తావించడంతో నిజమేనని భావించిన ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి తరహా లోనే ఈయన కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తారని అందరూ భావించారు కానీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తూ వచ్చారు..

కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలో కేవలం పెన్షన్ మాత్రమే అమలు చేశారు ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినప్పటికీ కూడా కేవలం కొంతమందికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ లభించింది. ఇక తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాల గురించి ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి వారికి సంక్షేమ పథకాలు గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇక ఇటీవల చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఒక వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉండగా ఓ వ్యక్తి పైకి లేచి అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారు సార్ అంటూ ప్రశ్నించారు దీంతో అలర్ట్ అయిన చంద్రబాబు నాయుడు త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు.తమ్ముడు ముందు ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూరాలి.. సంపద సృష్టించే మార్గం చెప్పు తమ్ముడు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే అంశాన్ని పెట్టుకొని వైసీపీ అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించింది.

 

గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫింషన్ పెంచడమే కాకుండా సచివాలయ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు మొదటి మూడు నెలల్లోనే ఉద్యోగాలు కల్పించారు అలాగే ఆరు నెలలలోపు అమ్మ ఒడి పథకాన్ని కూడా అమలు చేశారు కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలను ఇవ్వకపోవడంతో ప్రజల నుంచి కూడా తిరుగుబాటు మొదలైంది ఇలాగే కొనసాగితే చంద్రబాబు నాయుడు అలాగే కూటమినేతలు బయట తిరగడం కూడా కష్టమేనని పలువురు భావిస్తున్నారు దీంతో వెంటనే కొన్ని పథకాలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వము అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.