Ram Gopal Varma: బాలకృష్ణను కూడా వదలనివర్మ.. ఆసక్తికరంగా మారిన వర్మ వ్యాఖ్యలు..!

Ram Gopal Varma: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్ అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ. ఈయన ప్రతి విషయంలోనూ కల్పించుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడి తరుచు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా వర్మ ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధర పెంపు విషయంపై పోరాడి నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేశారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో తలదూర్చి వివాదాలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా అల్లు అర్జున్ బాలకృష్ణ గురించి పాజిటివ్ గా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

నందమూరి బాలకృష్ణ ” అన్ స్టాపబుల్ “ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే గోపాల్ వర్మ ఈ కార్యక్రమం గురించి తాజాగా కామెంట్స్ చేశారు. ఐశ్వర్య -ధనుష్ విడాకుల గురించి ట్వీట్ చేస్తూ సడన్ గా బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న కార్యక్రమం తనకు ఎంతో ఇష్టమని, తనకు ఆ కార్యక్రమంలో పాటిస్పేట్ చేయాలని ఉందనీ, బాలకృష్ణ గారు అవకాశం ఇస్తే ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాలని ఉంది. అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇలా ట్వీట్ చేసిన కొంత సమయానికి రామ్ గోపాల్ వర్మ తన మనసు మార్చుకుని ఆ ట్వీట్ డిలీట్ చేశారు. బాలకృష్ణ రామ్ గోపాల్ వర్మ మధ్య ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు, బాలకృష్ణ గారు తన కార్యక్రమానికి ఆహ్వానిస్తారో, లేదో చూడాల్సి ఉంది.

తాజాగా రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీ మీద రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ అంటే కేవలం అల్లు అర్జున్ మాత్రమేనని, చిరంజీవి ఫ్యామిలీ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో అల్లు అర్జున్ మాత్రమే మెగాస్టార్ అవుతాడని వర్మ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కంటే భవిష్యత్తులో అల్లు అర్జున్ కి క్రేజ్ ఎక్కువగా ఉంటుందని వర్మ ట్వీట్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ట్వీట్ కూడా డిలీట్ చేశాడు. వర్మ ఎప్పుడు అందరిని కించపరిచేలా మాట్లాడే వ్యక్తి.. అలాంటి వాడు ఇప్పుడు బాలకృష్ణ ,అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచెత్తుతుంటే అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.