పెళ్లి చేసుకున్న విడిపోవాల్సిందే… సినీ సెలబ్రిటీల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఈ మధ్య కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన సమంత విషయంలో చెప్పిన వ్యాఖ్యలు నిజం కావడంతో తరచూ ఈయన సినీ సెలబ్రిటీల గురించి చేసే వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నా మిగిలిపోతారని ముందుగానే చెప్పిన వేణు స్వామి చెప్పిన విధంగానే వారి వైవాహిక జీవితంలో విడిపోయారు.

తాజాగా మరికొందరు సెలబ్రిటీల జాతకాలను కూడా చెబుతూ వారి జాతకంలో దోషం ఉందని వీరు పెళ్లిళ్లు చేసుకున్న విడిపోతారని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక, అనుష్క, నయనతార వంటి హీరోయిన్లు మాత్రమే కాకుండా ప్రభాస్ కూడా పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితంలో విడిపోతారని వీరి వైవాహిక జీవితం సవ్యంగా కొనసాగదని వెల్లడించారు.వీరి జాతకంలో గురువు నీచ స్థానంలో ఉండటం వల్ల వీరికి వైవాహిక జీవితంలో సంతోషం ఉండదని వెల్లడించారు.

ఎప్పుడైతే కుజుడు గురువు నీచ స్థానంలో ఉంటారో వారి వైవాహిక జీవితంలో కష్టాలు తప్పవని వారు సంతోషంగా ఉండరని ప్రస్తుతం సెలబ్రిటీల జాతకం అలాగే ఉందని తెలియజేశారు. రెమ్యూనరేషన్ విషయంలో అందరికన్నా ఎక్కువగా రష్మిక రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అయితే పూజా హెగ్డే రష్మిక వారికి 2024 వరకు వారి కెరీర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతుందని, అనంతరం వీరికి అవకాశాలు తక్కువగా వస్తాయని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.