comedian Venu: నన్ను అపార్థం చేసుకొని నా మీద చెయ్యి చేసుకున్నారు… కమెడియన్ వేణు!

comedian Venu: జబర్దస్త్‌తో తన ప్రయాణంలో ఒక సందర్భం తనకు చాలా బాధ కలిగించిందని, అది కావాలని జరిగింది కాదని కమెడియన్ వేణు అన్నారు. అసలు అది ఎందుకలా జరిగిందో, తానేం చేశానో కూడా తనకే అర్థం కాదని ఆయన చెప్పుకొచ్చారు. లైఫ్‌లో అదొక ఫేజ్ అనుకుంటా అని ఆయన అన్నారు. ఇకపోతే తన స్వస్థలం సిరిసిల్ల అని, అక్కడ చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు ఓ అవినాభావ సంబంధం ఉందని వేణు అన్నారు. చిన్నప్పటి నుంచి కల్లు పోసే వాళ్లు అంతా తమ ఫ్యామిలీలా ఉంటామని, వాళ్ల పండగలకు తామెళ్లడం, తమ పండగలకు వాళ్లు రావడమనేది కొత్తేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. తామ మధ్య ఎలాంటి భేదాలూ లేవని, అంతా ఒక ఫ్యామిలీలా ఉంటామని ఆయన చెప్పారు.

అంత వరకే తనకు తెలుసు గానీ, ఆ సంఘటన తర్వాత ఇలా జరిగిందని అర్థమైందని ఆయన అన్నారు. వాళ్లు అంతగా వాళ్ల మనోభావాలు దెబ్బతినేంతగా ఏం జరిగిందనేది తనకు ఇప్పటివరకూ అర్థం కాదని వేణు అన్నారు. ఆ విషయంలో చాలా మంది బాధపడ్డారని ఆయన చెప్పారు. ఆ టైంలో తనకు అండగా నాగబాబుతో పాటు ఎంతో మంది గౌడ మిత్రులే సపోర్టుగా నిలిచారని ఆయన తెలిపారు. కానీ తన మీద చేయి చేసుకోవడం కొంచెం బాధ కలిగించినా, ఆ తర్వాత మళ్లీ కలిశాం, మాట్లాడామని ఆయన అన్నారు. ఎందుకన్నా ఇలా చేశారు, నేనేం చేశాను అని వాళ్లను కూడా తాను అడిగానని, వాళ్లు కూడా ఆ తర్వాత బాధపడ్డారని ఆయన వివరించారు.

తనకు వాళ్లేమీ శత్రువులు కాదని, వాళ్లక్కూడా తానేమీ శత్రువు కాదని, ఎప్పటికీ కూడా వాళ్లు తనతో మంచిగానే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వాళ్లలో కూడా తనకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆయన చెప్పారు. కానీ ఎప్పుడైనా యూట్యూబ్‌లో తన బాబు దానికి సంబంధించిన వీడియోలు చూసినపుడు మాత్రం చాలా బాధగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదొక్కటి తాను బాగా ఫీలవుతాడని, ఎందుకంటే తానేదో తప్పు చేసినట్టయిందనే ఫీలింగ్ తప్ప, వాళ్ల మీద తనకెలాంటి కోపమూ లేదని వేణు స్పష్టం చేశారు.